Satyabhama Teaser : కాజ‌ల్ స‌త్య‌భామ టీజ‌ర్

ఇర‌గ దీసిన ముద్దు గుమ్మ

Satyabhama Teaser : ఎవ‌రైనా పెళ్ల‌య్యాక సినిమాలలో న‌టించే ఛాన్స్ రావ‌డం చాలా అరుదు. సినీ ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. ఇవాళ ఉన్న హీరోయిన్ ఇంకో సినిమాలో ఉండ‌డం లేదు. అయితే సౌత్ ఇండ‌స్ట్రీలో పెళ్ల‌యినా ఇంకా సినిమాల‌లో మంచి పాత్ర‌లు ద‌క్క‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే 40 ఏళ్ల వ‌య‌సు క‌లిగి, ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన న‌య‌న తార ఏకంగా రూ. 20 కోట్లు తీసుకుంటోంది.

Satyabhama Teaser Viral

ఆమె ఇటీవ‌ల షారుక్ ఖాన్ తో పోటీ ప‌డి న‌టించింది జ‌వాన్ లో. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. మ‌రో వైపు త్రిష రెండో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది. త‌ను పొన్నియ‌న్ సెల్వ‌న్ లో దుమ్ము రేపింది. త‌ళ‌ప‌తి విజ‌య్ తో లియోలో న‌టించి మెప్పించింది.

ఇదే స‌మ‌యంలో కాజ‌ల్ అగ‌ర్వాల్(Kajal Agaarwal) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌ను తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్. ఉన్న‌ట్టుండి పెళ్లి చేసుకుంది. ఆ త‌ర్వాత సినిమాల్లో అవ‌కాశం రాదేమో అనుకున్నారు. కానీ అనిల్ రావిపూడి త‌న‌ను నంద‌మూరి బాల‌కృష్ణ తో తీసిన‌ భ‌గవంత్ కేస‌రిలో కాజ‌ల్ కు ఛాన్స్ ఇచ్చాడు.

తాజాగా త‌నే కీరోల్ లో న‌టిస్తోంది స‌త్య భామ‌. ఈ మూవీకి సంబంధించి టీజ‌ర్ విడుద‌లైంది. అద్భుత‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. విడుద‌ల‌య్యాక స‌క్సెస్ అవుతుంద‌న్న నమ్మ‌కంతో ఉన్నారు నిర్మాత‌లు.

Also Read : Hi Nanna: దర్శకుడిగా వస్తున్న విజయేంద్రప్రసాద్ శిష్యుడు

Comments (0)
Add Comment