Satya Dev: దీపావళికి సత్యదేవ్ పాన్ ఇండియా సినిమా ‘జీబ్రా’ !

దీపావళికి సత్యదేవ్ పాన్ ఇండియా సినిమా ‘జీబ్రా’ !

Satya Dev: సత్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కిస్తోన్న తాజా పాన్‌ ఇండియా సినిమా ‘జీబ్రా’. పద్మజ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఓల్డ్‌ టౌన్‌ పిక్చర్స్‌ బ్యానర్లపై ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎస్‌.పద్మజ, బాల సుందరం, దినేశ్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిసినాటో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యరాజ్, సత్య, సునీల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా అక్టోబరు 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని మంగళవారం ప్రకటిస్తూ.. ఈ చిత్రంలోని పాత్రలకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Satya Dev Movie Updates

‘‘యాక్షన్‌ ప్రాధాన్యమున్న విభిన్నమైన ఇంటెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. సినిమాలోని ప్రతి పాత్ర ఆసక్తి రేకెత్తించేలాగే ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా సత్య పొన్మార్‌ పనిచేస్తున్నారు.

Also Read : Kangana Ranaut: సినిమాల కంటే ఓటీటీలకే సెన్సార్‌ అవసరం – నటి కంగనా రనౌత్‌

Satya DevZebra
Comments (0)
Add Comment