Satya Dev :అంచనాలు పెంచేసిన సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ ట్రైలర్!

అంచనాలు పెంచేసిన సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ ట్రైలర్!

Satya Dev:టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన తాజా సినిమా ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ సరసన అతీరా రాజ్ హీరోయిన్ గా నటిస్తుండగా… లక్ష్మణ్‌, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ ‘కృష్ణ‌మ్మ‌’తో ఈ నెల 10న ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు హీరో సత్యదేవ్. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ‘కృష్ణమ్మ’ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్‌ రావిపూడి, గోపీచంద్‌ మలినేని ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Satya Dev:

తాజాగా రిలీజైన ట్రైలర్‌ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఓకేసులో సత్యదేవ్‌(Satya Dev) ను అన్యాయంగా ఇరికిస్తారు. అతను ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డాడనే కాన్సెప్ట్‌ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌ లో కథ నడకకైనా… నది నడకకైనా మలుపులే అందం… కానీ కొన్ని మలుపుల్లో సుడులు ఉంటాయ్… అంటూ సత్యదేవ్ చెప్పిన డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ట్రైలర్‌లో సత్యదేవ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరించి మెగాస్టర్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా సెటిల్డ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్. గతేడాది ‘గాడ్సే’ సినిమాతో వచ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ‌ప‌రిచిన స‌త్య‌దేవ్.. ఈసారి మాస్ బొమ్మ ‘కృష్ణ‌మ్మ‌’తో వస్తున్నారు.

Also Read :-Hari Hara Veera Mallu:ఆశక్తికరంగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్ !

KrishnammaSatya Dev
Comments (0)
Add Comment