Sasivadane: ‘పలాస’ 1978 స్టార్ రక్షిత్ అట్లూరి, కోమలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘శసివాడనే ‘. AG ఫిల్మ్ కంపెనీ, S.V.S. గౌరీ నాయుడు సమర్పణలో అహితేయ బెల్లంకొండ మరియు అభిలాష్ రెడ్డి స్టూడియో బ్యానర్ పై నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గోదావరి నేపధ్యంలో రొమాన్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 19న సినిమాను భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నైజాం రీజియన్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Sasivadane Movie Updates
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాం రీజియన్‌లో ‘శశివధనే(Sasivadane)’ సినిమా పంపిణీ హక్కులను సొంతం చేసుకుంది. ఇటీవల ఎన్నో హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి సంస్థ ఈసారి ‘శశివదనే’ ని డిస్ట్రిబ్యూట్ చేయనుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి శరవణన్ వాసుదేవన్ సంగీతం అందించగా, అనుదీప్ దేవ్ బిజిఎమ్ అందించారు. శ్రీసాయికుమార్ దారా కెమెరామెన్‌గా, బిహెచ్ గారి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
Also Read : Premalu OTT : సరికొత్త ప్రేమకథ గా రూపుదిద్దుకున్న ‘ప్రేమలు’ సినిమా ఓటీటీలో