Sarkari Noukari: ప్రముఖ సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(K Raghavendra Rao) నిర్మాతగా, గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరక్కించిన సినిమా ‘సర్కారు నౌకరి’. ఆర్కే టెలీ షో బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ సరసన భావన వళపండల్ నటిస్తోంది. 2024 జనవరి 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శేఖర్ కమ్ముల, విఎన్ ఆదిత్య, తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయిత బివిఎస్ఎన్ రవి, సింగర్ సునీత, మరియు చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Sarkari Noukari Viral
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథలో గోపాల్(ఆకాష్)కి ఆరోగ్య శాఖలో ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెళ్లైన భార్య (భావన)తో కలిసి తెలంగాణలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్తాడు. గ్రామాల్లో నిరోధ్ వాడకం గురించి అవగాహన కల్పించడం గోపాల్ పని. అయితే గోపాల్‌కు ఆ ఊరి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో పాటు… నిరోధ్ వాడకం గురించి తెలియక వాటిని పిల్లలు ఆడుకునే బుగ్గలుగా చూస్తారు. అంతేకాదు గోపాల్‌ని బుగ్గలోడు అని హేళన చేస్తారు. గోపాల్ చేసే పని కాపురంలో కూడా ఈ కండోమ్స్ చిచ్చు పెడుతుంది. దీనితో ఆ ఉద్యోగం భార్యకు నచ్చక… ఉద్యోగమో నేనో తేల్చుకోమని భార్య అంటుంది. అప్పుడు హీరో ఏం చేశాడు? ఉద్యోగాన్ని ప్రాణంగా భావించే గోపాల్ తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేదే మిగతా కథ. ట్రైలర్ కామెడీగా అనిపించినా.. చాలా ఇదొక ఎమోషనల్ స్టోరీలా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ‘సర్కారు నౌకరి’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ… ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.
Also Read : Vishal-Vijay: విజయ్ సినిమాను కొట్టేసిన విశాల్