Saripodhaa Sanivaaram: ఓటీటీలోనికి నాని ‘సరిపోదా శనివారం’ ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఓటీటీలోనికి నాని 'సరిపోదా శనివారం' ! స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన తాజా బ్లాక్ బస్టర్ ‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటించారు. ప్రముఖ నటుడు ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ సినిమా తర్వాత వివేక్-నాని(Nani) కాంబినేషన్ లో ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాదు దసరా, హాయ్ నాన్న సినిమాల తరువాత నానికి హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.

ఇటీవలే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. థియేటర్లలో రిలీజైన నెలలోపే స్ట్రీమింగ్ కానుందని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్‌ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబ‌ర్ 26 నుంచి ఒకేసారి అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. సో.. ఎవ‌రైతే థియేట‌ర్లలో మిస్స‌య్యారో, సినిమాను మ‌ళ్లీ చూడాల‌నుకుంటున్నారో ఈ గురువారం నుంచి మిస్స‌వ్వ‌కుండా చూసేయండి.

Saripodhaa Sanivaaram – ‘సరిపోదా శనివారం’ కథేమిటంటే ?

త‌న కళ్లేదుట చిన్న చెడు ఘ‌ట‌న జ‌రిగినా తీవ్ర ఆవేశంతో,కోపంతో ర‌గిలిపోతూ ఎదుటి వారు ఎంత‌టి వారైనా స‌రే వెళ్లి వారిపై దాడి చేస్తుంటాడు సూర్య‌. అయితే ఆ కోపం ఎల్ల‌వేళ‌లా ప‌నికిరాద‌ని దానికంటూ విలువ ఉండాల‌ని త‌న త‌ల్లి చివ‌ర‌గా చెప్పిన మాట మేర‌కు కేవ‌లం శ‌నివారం మాత్ర‌మే త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ అందుకు కార‌ణ‌మైన వారిని దండిస్తుంటాడు. మ‌రోవైపు సీఐ దయానంద్ (ఎస్.జె.సూర్య) త‌న అన్న వ‌ళ్ల ఇబ్బంది ప‌డుతూ.. ఆ కోపాన్ని స‌మీపంలోని సోకుల‌పాలెంలోని వారిపై చూపిస్తూ అక్క‌డి వారికి న‌ర‌కం చూపిస్తుంటాడు.

ఈ క్ర‌మంలో సీఐ ప‌ని చేసే స్టేస్ట‌ష‌న్‌కు కొత్త‌గా వ‌చ్చిన కానిస్టేబుల్ చారుల‌త వ‌ళ్ల సూర్య‌కు ఈ సోకుల పాలెం విష‌యం తెలుస్తుంది. ఆపై సీఐని ఎదుర్కోవ‌డానికి సూర్య‌ ఏం చేశాడు, సైకో మ‌న‌స్త‌త్వం ఉన్న‌ ద‌యానంద్ ఎలా రియాక్ట్ అయ్యాడు, అసలు సోకులపాలెంకు ఉన్న స‌మ‌స్య‌ ఏమిటి ? ఆ సోకులపాలెంపై దయానంద్ పగబట్టడానికి కారణమేంటి? చివరికి ఎలా సాల్వ్ చేశారు? చారులత‌కు, సూర్యకు ఉన్న బంధమేంటి ? అనే క‌థ‌క‌థ‌నాల‌తో సినిమా సాగుతూ ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన హాస్యాన్ని, మ‌ద‌ర్ సెంటిమెంట్‌, అదిరిపోయే పోరాట స‌న్నివేశాలు ఇలా అన్ని ర‌కాల ఎమోష‌న్స్, థ్రిల్‌ను ఇస్తుంది.

Also Read : Mad Square: నార్నే నితిన్ ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ నుంచి సాంగ్‌ విడుదల !

Natural Star NaninetflixSaripodhaa Sanivaaramvivek athreya
Comments (0)
Add Comment