Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని నటించిన యూనిక్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి గ్రేట్ బాక్సాఫీస్ మైల్ స్టోన్‌ని సాధించింది. ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా అద్భుతమైన రన్‌తో దూసుకెళుతూ మూడో వారంలో కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక ఈ చిత్రం రూ. 100 కోట్లు సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ ఇప్పుడు సరిపోయింది.. ఒక కుటుంబంలా నిలబడి అందరూ ఈ ఘనతను సాధించేలా చేశారు కాబట్టి.. కృతజ్ఞతలు తెలపడం లేదు. పోయారు.. అందరూ పోయారు’’ అంటూ 100 కోట్ల పోస్టర్‌ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పోస్ట్ చేసింది. దీనికి అభిమానులు రియాక్ట్ అవుతూ.. ‘‘ఇక సరిపోయిందిగా.. ఇకనైనా ఓజీపై దృష్టి పెట్టి అప్డేట్స్ వదులు మామా’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Saripodhaa Sanivaaram Collections..
‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’లో నాని మరో అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో అలరించారు. వరుస హిట్‌లు అతని గ్రోయింగ్ పాపులారిటీని సూచిస్తున్నాయి. నాని, SJ సూర్య.. ఈ రెండు పవర్‌హౌస్ ట్యాలెంట్స్ డైనమిక్ ఫేస్ అఫ్ విజువల్ ఫీస్ట్‌ని ప్రేక్షకులకు అందించింది. ప్రస్తుతం ఈ సినిమా డొమస్టిక్, ఓవర్సీస్‌లో కన్సిస్టెంట్‌గా కలెక్షన్లను రాబోడుతోంది. నార్త్ అమెరికాలో 2.48 మిలియన్ల గ్రాస్‌తో ఈ చిత్రం $2.5 మిలియన్ల మార్కుకు చేరువలో ఉంది. ఇది ఇప్పటికే నార్త్ అమెరికాలో నానికి బిగ్గెస్ట్ గ్రాసర్. అలాగే నాని మునుపటి బ్లాక్ బస్టర్ ‘దసరా’ తర్వాత 100 కోట్ల మైలురాయిని చేరుకున్న రెండవ చిత్రం ‘సరిపోదా శనివారం’. ప్రస్తుతం మూవీ అన్ని చోట్లా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
Also Read : Shraddha Arya: తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్ ! పోస్ట్ వైరల్ !