Saripodhaa Sanivaaram: అదరగొడుతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ గ్లింప్స్ !

అదరగొడుతున్న నాని ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ గ్లింప్స్ !

Saripodhaa Sanivaaram: ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ సినిమాలతో వరుస విజయాలతో జోరుమీదున్న నేచురల్ స్టార్ నాని… ఇప్పుడు ‘సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram)’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుల్‌ మోహన్‌ నటిస్తున్నారు. ‘అంటే సుందరానికీ’ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. దీనితో నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఎస్.జే.సూర్య కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో… ఫస్ట్ గ్లింమ్స్ ను ఆయన వాయిస్ ఓవర్ తోనే విడుదల చేసారు. దీనితో ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మరుతోంది. ఒక ఫస్ట్ గ్లింప్స్ విషయానికి వస్తే…

Saripodhaa Sanivaaram Movie Updates

‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి. ఒకొక్క మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే వాడిని ఎవరైనా చూశారా… నేను చూశాను’’ అంటూ సినిమాలో నాని పాత్ర ఎలా ఉండనుందన్నది ఎస్‌.జె.సూర్య వాయిస్‌ ఓవర్‌తో ఈ ఫస్ట్ గ్లింప్స్ ను చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో నాని… సూర్య అనే పాత్రలో మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. తనకి ఎవరి మీద కోపమొచ్చినా ఆ కోపాన్నంతా శనివారం మాత్రమే తీర్చుకునే భిన్నమైన పాత్రను పోషిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ బట్టి ఇది పూర్తిగా యాక్షన్‌ సినిమాగా తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Renu Desai : అకిరా నామాట జవ దాటడు తప్పకుండా పాటిస్తాడు

DVV EntertainmentsNatural Star NaniSaripodhaa Sanivaaram
Comments (0)
Add Comment