Saripodhaa Sanivaaram : ప్రతి శనివారం వచ్చే అప్డేట్ లతో దూసుకుపోతున్న ‘సరిపోదా శనివారం’

ఈ శనివారం మేకర్స్ సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్స్‌ని రిలీజ్ చేశారు...

Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రతి శనివారం ఈ సినిమా నుండి వచ్చే పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్ సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా రిలీజైన నాట్ ఏ టీజర్ వీడియో మంచి స్పందనను రాబట్టుకోగా.. ఈ శనివారం మాత్రం ఈ సినిమా టీమ్ కావాల్సినంత ట్రీట్ ఇచ్చేసింది. అదేంటని అనుకుంటున్నారా..

ఈ శనివారం మేకర్స్ సినిమాలోని కీలక పాత్రల ఫస్ట్ లుక్స్‌ని రిలీజ్ చేశారు. ఇందులో భద్రగా అదితిబాలన్, గోవర్ధన్‌గా అజయ్, కూర్మానంద్‌గా మురళీ శర్మ, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్, కాళి, మార్టిన్, సుధగా హర్షవర్ధన్, కమలాకర్‌గా శుభలేఖ సుధాకర్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేశారు. అలాగే ఈ మూవీలో సోకులపాలెం చాలా క్రూసియల్‌గా వుంటుందని తెలుపుతూ.. సోకులపాలెం వరల్డ్‌ని పరిచయం చేసేలా ఓ స్పెషల్ పోస్టర్ రివీల్ చేశారు. ఫైనల్‌గా మార్ డాలా క్యాప్షన్‌తో సూర్యగా నాని బ్రాండ్ న్యూ పోస్టర్‌ని షేర్ చేశారు. నాని(Nani) ఇంటెన్స్ లుక్‌లో చూస్తున్న ఈ పోస్టర్ వావ్ అనేలా ఉంది. ఈ పోస్టర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Saripodhaa Sanivaaram Updates

ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 29 ఆగస్ట్, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : Hero Prabhas : ప్రభాస్ సినిమాకు హీరోయిన్ గా పాకిస్తాన్ హీరోయినా..?

CinemaSaripodhaa SanivaaramTrendingUpdatesViral
Comments (0)
Add Comment