Sardar 2 Movie : హీరో కార్తీక్ సర్దార్ 2 సినిమా కోసం క్యూ లో ముగ్గురు భామలు

Sardar 2 : హీరో కార్తీ ముగ్గురు భామలతో రొమాన్స్‌ చేయనున్నారు. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘సర్దార్‌’ చిత్రం రెండో భాగం తెరకెక్కుతుంది. తొలి భాగంలో హీరోయిన్లుగా రాశీఖన్నా, రజీషా విజయన్, లైలా నటించారు. ఈ సినిమా ప్రేక్షకాదారణ పొందడంతో పాటు నిర్మాతలకు, పంపిణీదారులకు లాభాల పంట పడించింది. ఇందులో హీరో కార్తీ రా అధికారిగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో తండ్రీకొడుకులుగా నటించారు. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందిస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి తీసుకెళ్ళారు. దర్శక నటుడు ఎస్‌జే సూర్య వంటి పలువురు అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Sardar 2 Movie Updates

అయితే, హీరోయిన్లుగా తొలి భాగంలో నటించిన వారిని కాకుండా కొత్త వారిని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. ఇందుకోసం మాళవికా మోహనన్, ప్రియాంకా మోహన్ తో పాటు టాలీవుడ్‌ హీరోయిన్‌ ఆషికా రంగనాథన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే, ఇప్ప‌టికే మాళ‌విక మోమ‌న‌న్‌, అషికల గురించి అధికారికంగా ప్ర‌క‌టించ‌గా ప్రియాంక మోహ‌న్ గురించి ఎంపికకు సంబంధించి నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేయాల్సివుంది.

Also Read : Akshay Kumar : తనపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ హీరో

Cinemasardar 2TrendingUpdatesViral
Comments (0)
Add Comment