Sarath Kumar : క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రతో తెలుగు తెరపై తనదైన ముద్ర వేసింది వరలక్ష్మి శరతకుమార్. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పలు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు ఆమె పెళ్లిపీటలెక్కనుంది. ఇప్పటికే సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలాయ్ సచ్దేవ్ తో ఏడడుగులు వేయనుంది. పెళ్లికి థాయ్‌లాండ్ వేదిక కానుంది. జూలై 2న, ఈ జంట తమ ట్రిపుల్ బాండ్‌తో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
Sarath Kumar..
తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఆమె తండ్రి శరత్‌కుమార్ డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తూ కనిపించారు. మెహందీ వేదికపై శరత్‌కుమార్ డ్యాన్స్ చేసి అతిథులను అలరించారు. దీనికి జోడించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : Lokesh Kanagaraj : ఈ మధ్య వస్తున్న పుకార్లకు చెక్ పెట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్