Sara Alikhan: శుభ్‌మన్‌ గిల్‌తో సారా డేటింగ్

శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్... సారా కీలక వ్యాఖ్యలు

శుభ్‌మన్‌ గిల్‌తో డేటింగ్… సారా కీలక వ్యాఖ్యలు

Sara Alikhan : భారత్ స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ పై నటి సారా అలీఖాన్(Sara Alikhan) కీలక వ్యాఖ్యలు చేసింది. డిస్నీ హాట్ స్టార్ వేదికగా ప్రముఖ నిర్మాత, నటుడు, దర్శకుడు కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో తన స్నేహితురాలు అనన్యపాండేతో కలిసి పాల్గొన్న సారా అలీఖాన్…. శుభ్ మన్ గిల్ తో డేటింగ్ పై వస్తున్న పుకార్లకు క్లారిటీ ఇచ్చారు. ‘‘శుభ్‌మన్ గిల్‌తో నువ్వు డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్‌ వస్తున్నాయి దానిపై మీ అభిప్రాయం ఏమిటి’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ఆ సారా తాను కాదని ఆమె బదులిచ్చారు.

‘‘సారా అనగానే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ ప్రపంచం మొత్తం రాంగ్‌ సారా వెనుక పడుతోంది’’ అని ఆమె స్పష్టం చేసింది. కాఫీ విత్ కరణ్ లో సారా అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. శుభ్‌మన్‌తో తాను ప్రేమలో లేనట్టు చెబుతూనే.. ఆ సారా తాను కాదంటూ… సచిన్ కుమార్తె సారా – గిల్‌ రిలేషన్‌లో ఉన్నారని ఆమె హింట్ ఇచ్చినట్లు అయ్యింది. ఇది ఇలా ఉండగా ఇదే షోలో పాల్గొన్న అనన్యా పాండే… ఆదిత్య రాయ్‌ కపూర్‌తో తాను ప్రేమలో ఉన్నానని పరోక్షంగా చెప్పారు.

Sara Alikhan – శుభ్ మన్ గిల్-సారా తెందూల్కర్ ల ప్రేమాయణం

శుభ్‌మన్‌ గిల్‌, సారా అలీఖాన్‌ ప్రేమలో ఉన్నారంటూ ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి దిగిన పలు ఫొటోలు కూడా గతంలో వైరల్‌ అయ్యాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్‌ నటి సారా అలీఖాన్‌తో డేట్‌లో లేడని.. క్రికెటర్‌ సచిన్‌ కుమార్తె సారాను ఆయన ప్రేమిస్తున్నాడని పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రపంచ కప్‌ టోర్నీలో భాగంగా భారత్‌ – బంగ్లాదేశ్‌ మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో గిల్‌ హాఫ్‌ సెంచరీ చేయగానే గ్యాలరీలో ఉన్న సారా తెందూల్కర్‌ సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం శుభ్ మన్ గిల్… ఇటీవల ఐసిసి ప్రకటించిన అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

గత రెండేళ్ళుగా సూపర్ ఫాంలో ఉన్న శుభ్ మన్ గిల్….. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్, ధోనీ, కోహ్లీ తరువాత వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న నాలుగో ఆటగాడుగా శుభ్ మన్ గిల్ రికార్డులకెక్కాడు.

Also Read : Singham Again Movie : సింగం అగైన్ రెడీ

kaffe with karansara alikhansubhmangil
Comments (0)
Add Comment