Sara Ali Khan: యాచకులకు ఫుడ్‌ పంచిన బాలీవుడ్ బ్యూటీ !

యాచకులకు ఫుడ్‌ పంచిన బాలీవుడ్ బ్యూటీ !

Sara Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్… మొదట్లో బొద్దుగా ఉన్నా… సినిమా కెరీర్ ను దృష్టిలో ఉంచుకుని బరువు తగ్గించుకుని సన్నబడింది. హీరోయిన్ అవ్వాలంటే వారసత్వం, టాలెంట్ తో పాటు స్టార్ ఇమేజ్ కు ధీటుగా కష్టపడేతత్వం ఉండాలని ఆమె బరువు తగ్గడం ద్వారా నిరూపించింది. దీనితో ప్రస్తుతం సారా అలీఖాన్… సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులతో బిజీ స్టార్ గా మారింది. ఇటీవల ‘మర్డర్‌ ముబారక్‌’, ‘ఏ వాతా మేరే వాతా’ అనే ఓటీటీ ప్రాజెక్టులతో వెబ్‌ ఆడియన్స్‌ ను విశేషంగా అలరించింది.

Sara Ali Khan Distribute

అయితే ఇటీవల ముంబైలోని జుహు ప్రాంతంలోని శనీశ్వరుడి ఆలయానికి వెళ్లిన సారా అలీఖాన్(Sara Ali Khan)… దేవుడిని దర్శించుకున్న అనంతరం బయట ఉన్న యాచకులకు స్వీట్లు, ఫుడ్ పంచింది. భిక్షాటన చేస్తున్న అందరికీ స్వీటు బాక్సులు పంచుతుండటంగా అక్కడ ఉన్న మీడియావాళ్లు ఆమెను ఫోటోలు, వీడియోల్లో బంధించేందుకు ప్రయత్నించారు. దీనితో విసుగెత్తిన బాలీవుబ్ బ్యూటీ… ప్లీజ్‌, ఆపేయండి. మిమ్మల్ని బతిమాలి, బతిమాలి నేను అలిసిపోతున్నాను. కానీ మీరు మారడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. స్వీట్లు పంచిన అనంతరం అక్కడినుంచి విసురుగా కారెక్కి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం సారా అలీ ఖాన్‌ ‘మెట్రో ఇన్‌ డినో’ అనే సినిమా చేస్తోంది.

Also Read : Manjummel Boys: తెలుగులో మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ !

Saif Ali KhanSara Ali Khan
Comments (0)
Add Comment