Sara Ali Khan : క్రికెట‌ర్ తో డేటింగ్ పై కామెంట్

సారా అలీ ఖాన్ స్ప‌ష్టం

Sara Ali Khan : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సారా అలీ ఖాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌రా హ‌త్కే జ‌రా బ‌చ్కే, అత్రంగి రే, సింబా త‌దిత‌ర చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ లో మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్ గా కొన‌సాగుతున్న శుభ్ మ‌న్ గిల్ తో తాను డేటింగ్ లో ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రగ‌డంపై స్పందించింది. తాను గిల్ తో డేటింగ్ లో లేనంటూ స్ప‌ష్టం చేసింది.

Sara Ali Khan Comment

ప్ర‌ముఖ పేరు పొందిన చాట్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 8లో మ‌రో న‌టి అన‌న్య పాండేతో క‌లిసి సారా అలీ ఖాన్(Sara Ali Khan) క‌నిపించ‌నుంది. ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ అయ్యింది. తాను క్రికెట‌ర్ గిల్ తో డేటింగ్ లో ఉన్న‌ట్టు ప్ర‌చార‌మేన‌ని కొట్టి పారేసింది.

ఇదిలా ఉండ‌గా షో సంద‌ర్బంగా క‌ర‌ణ్ జోహార్ డేటింగ్ విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. దీనిపై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేసింది సారా అలీ ఖాన్. ఇదంతా ఎవ‌రో కావాల‌ని త‌న‌పై లేనిపోనివి ప్ర‌చారం చేస్తున్నారంటూ పేర్కొంది.

ఇదిలా ఉండ‌గా శుభ్ మ‌న్ గిల్ ఇప్పుడు ప్ర‌ముఖ భార‌త మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ కూతురు సారా టెండూల్క‌ర్ ప్రేమ‌లో ప‌డ్డారు. అయితే సారా పేరుతో ఇద్ద‌రు ఉండ‌డంతో స్టేడియంలో శుభ్ మ‌న్ గిల్ , సారా అంటూ ప్ల కార్డుల‌తో ద‌ర్శ‌నం ఇచ్చారు. దీనిపై క్లారిటీ ఇవ్వ‌డంతో గిల్ , సారా టెండూల్క‌ర్ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : Amitabh Bachchan : ర‌ష్మిక వీడియోపై బిగ్ బీ ఫైర్

Comments (0)
Add Comment