Pelli Kaani Prasad : టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా గుర్తింపు పొందాడు సప్తగిరి(Sapthagiri). తను రాయలసీమ యాసతో ఇరగదీస్తాడు. తాజాగా తను హీరోగా నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్(Pelli Kaani Prasad). ఈ చిత్రానికి సంబంధించి విడుదలైంది టీజర్. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. దర్శకుడు పూర్తిగా వినోదాత్మకంగా ఉండేలా చూశాడు. ఇంటిల్లిపాది నవ్వుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకుడు పెట్టే ప్రతి పైసాకు గ్యారెంటీ ఇచ్చేలా తాము సినిమాను తీయడం జరిగందన్నారు మూవీ మేకర్స్.
Pelli Kaani Prasad Movie Sensational
పెళ్లి కాని ప్రసాద్ మూవీలో మెయిన్ లీడ్ పోషించారు. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించాడు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. టీజర్ సప్తగిరిని తన తండ్రికి కట్టుబడి ఉండే ప్రసాద్‌గా పరిచయం చేస్తుంది.
అదే సమయంలో, అతను తన పూర్వీకుల నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఇంతలో, కట్నం అనేది అతని ఇంటిపేరు. ఈ సినిమా కథాంశం తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అతను కట్నం తీసుకోవాలి అనే దాని చుట్టూ తిరుగుతుంది. మొత్తంగా మరోసారి అలరించేందుకు ప్రయత్నం చేశాడు నటుడు , కమెడియన్ సప్తగిరి. ఇందులో గౌడ్ తో పాటు అన్నపూర్ణ నటించడం విశేషం.
విజన్ గ్రూప్ కు చెందిన కేవై బాబు, భాను ప్రకాష్ గౌడ్ , సుక్కా వెంకటేశ్వర్ గౌడ్ , వైభవ్ రెడ్డి ముత్యాల నిర్మించగా కృష్ణ చాగంటి, నర్సింహ రాజు రాచూరి, కలవకూరి రమణ నాయుడు, నల్ల సహానా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read : Hero Akhil Agent Movie :మార్చి 14న రానున్న అఖిల్ ఏజెంట్