Beauty Sanya Malhotra :స‌న్యా మ‌ల్హోత్రా ‘మిసెస్’ హ‌ల్ చ‌ల్

ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వీక్ష‌ణం..

Sanya Malhotra : ఓటీటీలో లెక్క‌లేన‌న్ని సినిమాలు స్ట్రీమింగ్ కు వ‌స్తుంటాయి. కొన్నింటిని ఆద‌రిస్తుంటే మ‌రికొన్నింటిని ప‌దే ప‌దే చూసేందుకు ఇష్ట ప‌డుతున్నారు. క‌థలో ద‌మ్ముంటే చాలు మూవీస్, వెబ్ సీరీస్, షార్ట్ ఫిలింలు, సీరియ‌ల్స్ బిగ్ స‌క్సెస్ అందుకుంటున్నాయి.

Sanya Malhotra Movie

ఈ మ‌ధ్య‌న నిర్మాత‌లు, సంస్థ‌లు పెద్ద ఎత్తున టాలెంట్ క‌లిగిన వాళ్ల‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నాయి. ప్రస్తుతం ఓటీటీల మ‌ధ్య భారీ పోటీ నెల‌కొంది. ఈ పోటీ వాతావ‌ర‌ణం వేలాది మంది నైపుణ్యం క‌లిగిన న‌టీ న‌టులు, సాంకేతిక నిపుణులు, గేయ‌, క‌థా , డైలాగ్ రైట‌ర్లు, క‌వుల‌కు డిమాండ్ పెరిగేలా చేసింది.

తాజాగా స‌న్య మ‌ల్హోత్రా(Sanya Malhotra) వైర‌ల్ గా మారారు. ఇందుకు కార‌ణం త‌ను కీల‌క పాత్ర పోషించి న‌టించిన చిత్రం మిసెస్. ఇది పూర్తిగా మ‌హిళ‌ల వ్య‌క్తిత్వానికి సంబంధించిన క‌థ‌. పితృస్వామ్యం ఆధిప‌త్యాన్ని ప్ర‌శ్నిస్తుంది. ప‌లు ప్ర‌శ్న‌ల‌ను లేవ‌దీస్తుంది. ఎన్నో ఆలోచ‌న‌లు, ఇబ్బందులు ఎదుర్కొన్న తీరును అద్బుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు డైరెక్ట‌ర్.

మిసెస్ మూవీ ప్ర‌ధానంగా వివాహంలో చాలా మంది మ‌హ‌ళ‌లు ఎదుర్కొనే క‌ఠిన‌మైన వాస్త‌వాల‌ను అన్వేషిస్తుంది. ది గ్రేట్ ఇండియ‌న్ కిచెన్ కు ఇది అనుస‌ర‌ణ‌. నెర‌వేర‌ని ఆకాంక్ష‌ల ఇతివృత్తాల గురించి ప‌రిశీలించేలా చేస్తుంది మిసెస్. ఈ చిత్రం బిగ్ స‌క్సెస్ అయ్యింది. జీ గ్రూప్ కు చెందిన జీ5 ఓటీటీ సంస్థ దీనిని స్ట్రీమింగ్ చేసింది. మిలియ‌న్ల కొద్దీ వ్యూయ‌ర్స్ దీనిని ఆద‌రించారు. అక్కున చేర్చుకున్నారు. దేశంలో మ‌హిళా స‌మాజం ఏ ర‌కంగా ఇబ్బందులు ప‌డుతుందో ఈ చిత్రం ఆవిష్క‌రించిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

మిసెస్ మూవీ గురించి గూగుల్ లో ఎక్కువ‌గా వెతుకుతుండ‌డం విస్తు పోయేలా చేసింది. వీలైతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. చూడాల‌ని అనుకున్న వాళ్లు త‌ప్ప‌క వీక్షించండి.

Also Read : Thandel Success – Tirumala :తిరుమ‌లను ద‌ర్శించుకున్న‌ తండేల్ మూవీ టీం

CinemaSanya MalhotraUpdatesViral
Comments (0)
Add Comment