Santhana Prapthirasthu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో భిన్నమైన సబ్జెక్టులతో వచ్చే మూవీస్ కు ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. దీంతో అటు సినిమాలు ఇటు వెబ్ సీరీస్ లలో సైతం కుటుంబాన్ని చికాకు పెట్టే సమస్యలను కథలుగా మలిచి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Santhana Prapthirasthu Movie Updates
ఈ మధ్య కాలంలో బస్టాప్ ల మాదిరిగా పుట్టుకు వస్తున్నాయి సంతాన సాఫల్య కేంద్రాలు. అసలు స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలు ఏమిటో తెలుసు కోకుండా పిచ్చి వాళ్ల లాగా పరుగులు తీయడం చూస్తూనే ఉన్నాయి. కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది.
దీనినే పాయింట్ గా తీసుకుని ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలలో జాబ్స్ చేసే వారికి పిల్లలను కనడం అనేది ఓ బిగ్ ప్రాబ్లంగా మారి పోయింది. దీనినే బేస్ పాయింట్ గా తీసుకుని సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu) అనే పేరుతో సినిమా తీశాడు దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి. ముందు నుంచి తన లైన్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తన సినిమాపై కొంత మంది అభిమానులు ఫిక్స్ అయి పోయి ఉంటారు.
ప్రేక్షకులతో బాగా కనెక్టివిటీ ఉండే నటులను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు. ఇక ఎప్పటిలాగే వెన్నెల కిషోర్(Vennela Kishore) బాబా అవతారం ఎత్తడం ఇందులో విశేషం. మొత్తంగా సినిమాను యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీసుకు రాబోతోందన్నది పక్కా ఈ మూవీతో తేలి పోయింది.
సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో విక్రాంత్, చాందిని చౌదరి, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమతం, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్ష వర్ధన్, బిందు చంద్రమౌళి, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ మోరె బేతిగంటి, అభయ్ బేతి, అంటిగంటి నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.
Also Read : Pelli Kaani Prasad Sensational :పెళ్లి కాని ప్రసాద్ నవ్వుల హరివిల్లు