Sankranthiki Vasthunnam : ఓ వైపు ఎండా కాలం అయినా జనం పట్టించు కోవడం లేదు. పూర్తిగా నవ్వులు పూయించిన సంక్రాంతికి వస్తున్నాం దుమ్ము రేపుతోంది. ఇంటిల్లి పాది అంతా నవ్వుకునేలా చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఈ మూవీని రిలీజ్ చేశారు. భారీ సినిమాలు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ విడుదలయ్యాయి.
Sankranthiki Vasthunnam Movie OTT Sensational
కానీ ఊహించని రీతిలో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ అట్టర్ ప్లాప్ అయ్యింది. నందమూరి బాలయ్య నటించిన డాకు మహారాజ్ రూ. 130 కోట్లకు పైగా వసూలు సాధించింది. బిగ్ సక్సెస్ గా నిలిచింది. మరో వైపు స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) నిర్మించారు. ఎవరూ ఊహించని రీతిలో ఏకంగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ నిర్మాతలకు సంతోషం కలిగించేలా చేసింది ఈ మూవీ.
ఈ సందర్బంగా ఈ సినిమా విడుదలైన 92 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమాకు పెద్ద ఎత్తున వ్యూయర్షిప్ లభించింది. కేవలం 40 గంటల్లోనే ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్, సజ్జ తేజ తీసిన హనుమాన్ రికార్డ్ ను బ్రేక్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Also Read : Rajamouli SSMB29 Sensational :ఒడిశా తూర్పు కనుమల్లో జక్కన్న షూటింగ్