Sanjay Dutt: అక్షయ్‌కుమార్, అనిల్ కపూర్, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, లారా దత్తా, తుషార్ కపూర్ లాంటి భారీ తారాగణంతో అహ్మద్‌ఖాన్ తెరకెక్కిస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’. ఇందులో సీనియర్ నటుడు సంజయ్ దత్ సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు గతంలో అక్షయ్‌కుమార్, ఫిరోజ్ నడియాడ్ వాలా ప్రకటించారు. అయితే డేట్స్ సర్దుబాటు కారణంగా సంజయ్ దత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. దీనితో సంజయ్ దత్ అభిమానులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.
Sanjay Dutt Movie Updates
‘సంజయ్‌దత్(Sanjay Dutt) ఇతర సినిమాల షూటింగ్ కారణంగా ‘వెల్‌కమ్ టు ది జంగిల్’లో నటించలేకపోతున్నారు. ఈ విషయాన్ని మిత్రుడు అక్షయ్ కుమార్ కి వివరించారు. ఈ సినిమా నుంచి తప్పుకొంటున్నందుకు ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు’ అంటూ సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. సంజయ్ గతంలో మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరణలో సైతం పాల్గొన్నారు. ఆ సన్నివేశాలను అలాగే ఉంచి, అతడిని అతిథి పాత్రగా చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సంజయ్ దత్… పలు బాలీవుడ్ సినిమాలతో పాటు ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న సలార్ 2, పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ వంటి సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. దీనితో సంజయ్ దత్ డేట్స్ సర్ధుబాటు కావడం లేదని తెలుస్తోంది.
Also Read : Keerthy Suresh: గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో మహానటి ?