Sanjay Dutt: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ కు సీక్వెల్ గా తెరకెక్కిస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, కావ్య థాపర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనితో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందీ చిత్రం. తాజాగా తన పాత్రకు సంజయ్ దత్(Sanjay Dutt) డబ్బింగ్ పూర్తి చేసినట్లుగా మేకర్స్ తెలిపారు.
Sanjay Dutt Movie Updates
సంజయ్ దత్ డబ్బింగ్ పూర్తి చేసి… ఈ సినిమాకు తన పాత్రను పూర్తి చేశారు. ఇక ప్రమోషన్స్ కు ఆయన వస్తారా ? రారా ? అనేది తెలియాల్సి ఉంది. సంజూ భాయ్ తన వాయిస్‌ని అందించడం ద్వారా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారని మేకర్స్ చెబుతున్నారు. సంజయ్ దత్(Sanjay Dutt) తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి కావస్తుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మాస్ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్‌తో రెండు పాటలు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి.
టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సామ్ కె నాయుడు, జియాని గియానెలీ సినిమాటోగ్రఫీ అందించారు.
డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేనిల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ సంయుక్తంగా నటి ఛార్మి నిర్మాతగా 2019లో విడుదల అయిన ఈ చిత్రం అటు పూరి, ఇటు రామ్‌కు ఓ డిఫరెంట్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. దీనితో దర్శకుడు పూరి జగన్నాథ్… ఈ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రామ్ కి ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ మళ్ళీ ఒక మంచి బ్రేక్ ఇస్తుందని అనుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ సినిమాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకో పక్క దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాతో మళ్ళీ విజయం సాధించాలని చూస్తున్నారు. అందుకనే ఈ సినిమాపై దృష్టి పెట్టి ఎలా అయినా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Megastar Chiranjeevi: పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ వీక్షణకు మెగా ఫ్యామిలీ పయనం !