Sandhya Theatre : బన్నీ చేసిన తప్పుల వల్లనే ఇంత వరకు వచ్చిందా..?

ముఖ్యంగా, కేటీఆర్‌ ట్వీట్‌ మరియు రాజకీయ వర్గాల విమర్శలు ఈ ఇష్యూని మరింత ముదిరేలా చేశాయి...

Sandhya Theatre : సంధ్య థియేటర్‌ దగ్గర మహిళ మృతి తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun) చేసిన చర్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఒక ప్రాణం పోయినందుకు, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడనే బాధ అల్లు అర్జున్‌(Allu Arjun)కి లేదు’’ అని చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. అది కరెక్ట్‌ కాదు. ఎందుకంటే బన్నీకి అభిమానులు అంటే ప్రాణం. ఒక సాటి మనిషి తొక్కిసలాటలో చనిపోవడం ఆయనకు కూడా బాధ కలిగించే విషయమే. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది. ఈ ఘటన తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun) చేసిన కొన్ని పనులు చాలామందికి నచ్చలేదు. అసహనానికి గురయ్యేలా చేశాయి. అది ఆయన వ్యక్తిత్వం, అనాలోచిత నిర్ణయాలే అని చెబుతున్నారు. దాని వల్లే ఇన్ని విమర్శలు.

Sandhya Theatre – Allu Arjun

చనిపోయిన మహిళ గురించి ప్రెస్‌మీట్‌ పెట్టినప్పుడు, పుష్ప బ్రాండ్‌ ప్రమోషన్‌ షర్ట్‌ వేసుకుని రావడం పలు విమర్శలకు దారి తీసింది. పోలీసులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు, కాఫీ తాగుతూ అహంకారంతో ప్రవర్తించడం కూడా ప్రజలకు నచ్చలేదు. కోర్టులో ఆయన తరఫు లాయర్‌ చేసిన వ్యాఖ్యలు, ‘‘పోలీసులు కూడా హీరోను చూడడానికి బాల్కనీలో ఉన్నారు’’ అనే మాటలు అసహ్యకరంగా ఉండటమే కాకుండా, బాధితులకు అవమానం కలిగించాయి. బెయిలు వచ్చిన తర్వాత ఇంట్లో ఉండకుండా, బయట లాన్‌లో బల ప్రదర్శన చేయడం ఆయన మీద నెగటివ్‌ ప్రచారాన్ని తెచ్చింది. రాజకీయ నేతలు కూడా ఈ ఘటనను ఉపయోగించుకుని, ఆయనపై మరిన్ని విమర్శలు చేశారు.

ముఖ్యంగా, కేటీఆర్‌ ట్వీట్‌ మరియు రాజకీయ వర్గాల విమర్శలు ఈ ఇష్యూని మరింత ముదిరేలా చేశాయి. అభిమానులు ఉదృతిని తగ్గించడానికి బన్నీని పోలీసులు వెళ్ళిపోమని వారించినా ఆయన అక్కడే ఉండటం ఇప్పుడు పెద్ద తప్పుగా కనిపిస్తుంది. చివరికి డీసీపీ బలవంతంగా తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. దీని గురించి అల్లు అర్జున్‌ ‘‘నాకు విషయం తెలియదు’’ అని ఇచ్చిన వివరణ చాలా మందిని అసంతృప్తి పర్చింది. ఈ ఉదంతంలో అనేక పొరపాట్లు ఉన్నాయి. ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు పోలీసుల పట్ల ప్రవర్తన, కోర్టులో లాయర్‌ చేసిన జోకులు బహిరంగంగా ఇంటి ఆవరణ లో బల ప్రదర్శన చేయడం కూడా సమస్యను మరింత పెంచింది. రాజకీయ నాయకులు విమర్శలు మరియు సోషల్‌ మీడియాలో వచ్చిన కామెంట్స్‌, ఈ వ్యవహారాన్ని మరింత దుష్ప్రచారానికి గురిచేశాయి.

అంతే కాకుండా పోలీస్‌ సూచనలు పాటించకుండా, థియేటర్‌ దగ్గర క్రౌడ్‌, జపాల భద్రత ఆలోచించకపోవడం అనాలోచిత చర్యగా విమర్శలకు గురైంది. పోలీస్‌ల రిక్వెస్ట్‌ను పట్టించుకోకుండా రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండడం, ఆ తర్వాత బలవంతంగా తరలించాల్సిన పరిస్థితి రావడం ప్రజల్లో వ్యతిరేకత కలిగించింది. ఇంత జరిగినా, అల్లు అర్జున్‌ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా ‘‘మా అబ్బాయి సినిమాను ఎంజాయ్‌ చేయలేకపోతున్నాడు’’ అని అల్లు అరవింద్‌ చేసిన వ్యాఖ్యలు మరింత నెగటివిటీ పెంచాయి. ఈ ఘటన అల్లు అర్జున్‌ పబ్లిక్‌ ఇమేజ్‌ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ప్రజెంట్‌ సోషల్‌ మీడియా చిన్న విషయాన్ని కూడా క్షణాల్లో పెద్దదిగా చూపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇన్ని తప్పులు పైకి కనిపించడం తో చిన్న చిన్న చర్యలు సరిపోవు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుభవాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాయి.

Also Read : Game Changer : డల్లాస్ ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ లో అభిమానుల పై ప్రశంసలు కురిపించిన చరణ్

allu arjunCinemaPushpa 2UpdatesViral
Comments (0)
Add Comment