Sandeep Reddy Vanga :’యానిమల్’ పై వస్తున్న విమర్శలకు వంగా స్ట్రాంగ్ రిప్లై

జావేద్ అక్తర్ విషయంలోనే కాదు గతంలో కిరణ్ రావు వ్యాఖ్యల విషయంలోనూ సందీప్ ఇలా స్పందించాడు.

Sandeep Reddy Vanga : యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా పై అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి. సందీప్ చేసిన పనిపై సినీ తారలు కూడా వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ‘యానిమల్’ డైరెక్టర్ గట్టిగానే స్పందించారు. యానిమల్ సినిమా స్త్రీలను పోట్రె చేసే విదంగా ఉందంటూ చాలా విమర్శలను అందుకుంది. తాజాగా, ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా స్పందించారు.

Sandeep Reddy Vanga Comment

జావేద్ కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ, “మీ ఫ్యామిలీ కంటెంట్‌పై దృష్టి పెట్టండి” అన్నారు. మీ కుమారుడు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ చూశారా? ‘బూతులు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని ఆ సిరీస్ లో ఉంటాయి’ ఘాటు గా సమాధానమిచ్చారు. జావేద్ అక్తర్ విషయంలోనే కాదు గతంలో కిరణ్ రావు వ్యాఖ్యల విషయంలోనూ సందీప్(Sandeep Reddy Vanga) ఇలా స్పందించాడు. దిల్ చిత్రంలో కిరణ్ రావు మాజీ భర్త అమీర్ ఖాన్ తప్ప, యానిమల్ లో ఎలాంటి అప్రియమైన సన్నివేశాలు లేవని దర్శకుడు సందీప్ అన్నారు.

ఇవి పక్కన పెడితే.. బాక్సాఫీస్ వద్ద యానిమల్ భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవ‌లే ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమాకి డిజిట‌ల్ ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

Also Read : Hero Nani : వరుస ఆఫర్లతో కన్ఫ్యూజ్ అవుతున్న నేచురల్ స్టార్

animalCommentssandeep vangaViral
Comments (0)
Add Comment