Hero Chiranjeevi-Vanga: చిరంజీవికి క‌థ చెప్పాన‌న్న వంగా 

త్వ‌ర‌లోనే మూవీ ఉండే ఛాన్స్ 

Chiranjeevi : ఒకే ఒక్క సినిమాతో తెలుగులో షేక్ చేసిన డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి(Sandeep Reddy Vanga). త‌న‌కు సాహిత్యం, పాట‌లు అంటే చ‌చ్చేంత ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ, ఇంగ్లీష్ ..ఇలా ప్ర‌తి భాష‌లో మంచి సాంగ్ ఉంటే చాలు..వినిపించినా వెతికి ప‌ట్టుకుని విన‌డం అల‌వాటు. త‌న‌ను చూస్తే పాన్ ఇండియా డైరెక్టర్ అనిపించ‌డు. అంత‌లా సింపుల్ గా ఉంటాడు. కానీ ఒక్క‌సారి క‌మిట్ అయితే త‌న మాట త‌నే విన‌డు. ఒక ర‌కంగా ప‌ని రాక్ష‌సుడు అని పేరు కూడా ఉంది.

Sundeep Reddy Vanga Movie With Chiranjeevi

త‌న అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను నిర్మోహ మాటంగా చెప్పే అతి కొద్దిమంది ద‌ర్శ‌కుల‌లో వంగా సందీప్ రెడ్డి ఒక‌డు. త‌న‌కు లోప‌ల ఒక‌టి బ‌య‌ట మ‌రోటి చెప్పే అలవాటు లేదు. త‌ను తీసింది మూడు సినిమాలే అయినా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. ఇండియాను షేక్ చేశాయి.

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ బీర్ క‌పూర్ అయితే వంగాతోనే మ‌రో మూవీ చేయాల‌ని ఉంద‌న్నాడు. ఇక సందీప్ రెడ్డి ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో స్పిరిట్ మూవీ తెరకెక్కించేందుకు సీరియ‌స్ గా వ‌ర్క్ చేస్తున్నాడు. ఈ త‌రుణంలో ఈ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేమిటంటే మెగాస్టార్ చిరంజీవికి క‌థ చెప్పాన‌ని, త‌ను కూడా ఓకే చెప్పాడ‌ని తెలిపాడు. సో స్పిరిట్ త‌ర్వాత మెగాస్టార్ తో ఉండ‌బోతోంద‌ని ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : Hero Naga Chaitanya-Thandel : థండేల్ దృశ్య కావ్యం స‌క్సెస్ ఖాయం

CinemaCommentsMega Star ChiranjeeviSandeep Reddy VangaViral
Comments (0)
Add Comment