Sandeep Reddy Vanga : హీరో సుహాస్ ‘పొట్టెల్’ సినిమాపై యానిమల్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

నేనీ సినిమా చూశా. చాలా నచ్చింది. రెండు పాటలైతే విపరీతంగా నచ్చాయి...

Sandeep Reddy Vanga : “పొట్టేల్‌’ సినిమా ప్రమోషన్స్‌ వినూత్నంగా చేస్తోంది చిత్ర బృందం. కొద్ది రోజులుగా ఎక్కడ చూసిన ఈ సినిమా టాపిక్‌ వినిపిస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ల జంటగా నటించిన చిత్రమిది. అర్జున్‌ రెడ్డి, ‘కబీర్‌ సింగ్‌’, ‘యానిమల్‌’ చిత్రాల దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఈ సినిమాకు ఫస్ట్‌ రివ్యూ ఇచ్చేశారు. సినిమా ఎలా ఉందో చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ “మొదట ‘పొట్టేల్‌(Pottel)’ కథ విన్నాను. దర్శకుడు సాహిత్‌ చిన్న కథ చేసుకున్నానని చెప్నాడు. కథ విన్నాక అది చిన్నది కాదు పెద్దదని అర్థమైంది’ అని అన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన అతిథిగా హాజరయ్యారు. సినిమాకు రివ్యూ ఇచ్చారు.

Sandeep Reddy Vanga Comment..

“నేనీ సినిమా చూశా. చాలా నచ్చింది. రెండు పాటలైతే విపరీతంగా నచ్చాయి. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. అజయ్‌ పాత్ర భయపెట్టించేలా ఉంది. యువ చంద్ర కృష్ణ, అనన్యా నాగళ్ళ, నోయల్‌, జీవా… మిగతా నటీనటులు అందరూ చక్కని నటన కనబరిచారు. నేనీ సినిమా చూశానని డబ్బా కొట్టడం లేదు. నిజంగా సినిమా బావుంది. ఇంత బాగా తీస్తారని ఊహించలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది. తెరకెక్కించడంలో దర్శకుడు ఇచ్చిన ట్రీట్మెంట్‌ బావుంది. యువ దర్శకులు ఈ తరహాలో పల్లెటూళ్లకు వెళ్లి సినిమా చేయడం ఈ మధ్య కాలంలో చూడలేదు. అప్పట్లో ‘రంగస్థలం’ చూశా. తర్వాత ఈ సినిమా చూశా. టీం కథ విన్న సమయంలో పెద్ద బడ్జెట్‌ సినిమా అనీ, పెద్ద లొకేషన్లలో తీయాల్సిన సినిమా అని అనిపించింది. నిర్మాతలకు ఇది సేఫ్‌ ప్రాజెక్ట్‌ అయింది. అక్టోబర్‌ 25న అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి, చిన్న సినిమాలను ఎంకరేజ్‌ చేయండి’’ అని అన్నారు.

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ చిత్రానికి సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కింది. రూరల్‌ యాక్షన్‌ డ్రామాగా ‘పొట్టేల్‌’ సినిమాను నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిశాంక్‌ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌ పతాకంపై సురేష్‌ కుమార్‌ సడిగే సంయుక్తంగా నిర్మించారు.

Also Read : Mazaka Movie : సంక్రాంతి బరిలో హీరో సందీప్ కిషన్ ‘మజాకా’ మూవీ

CinemaCommentsSandeep Reddy VangaSuhasTrendingViral
Comments (0)
Add Comment