Devara Movie : అర్జున్ రెడ్డి డైరెక్టర్ చిట్ చాట్ విత్ ‘దేవర’ టీమ్

ఇదొక యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్‌లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు తారక్‌...

Devara : జూ. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ వంగాతో ‘దేవర(Devara)’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్‌ అడిగిన ప్రశ్నలకు తారక్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు.

Devara Movie Updates

ఇదొక యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్‌లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు తారక్‌. చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా.. ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది.

Also Read : Love Sitara : ‘లవ్ సితార’ సినిమాలో నటించడం నాకు మంచి అనుభవం

CinemaDevaraTrendingUpdatesViral
Comments (0)
Add Comment