Sandeep Reddy Shocking :మూవీస్ తీయ‌డం రిస్క్ తో కూడుకున్న ప‌ని

పాన్ ఇండియా డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి

Sandeep Reddy : డైన‌మిక్ డైరెక్ట‌ర్ వంగా సందీప్ రెడ్డి ఏది మాట్లాడినా అది సంచ‌ల‌నంగా మారుతుంది. తాను తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు సినిమా రంగానికి సంబంధించి. చాలా మందికి సినిమాలు తీయ‌డం చాలా ఈజీ అనుకుంటార‌ని కానీ అత్యంత రిస్క్ తో కూడుకుని ఉన్న‌ద‌ని పేర్కొన్నాడు. దానికంటే బెట‌ర్ ఏమిటంటే అదే శ్ర‌మ చ‌దువుపై ఫోక‌స్ పెడితే ఈజీగా ఐఏఎస్ లేదా ఐపీఎస్ కావ‌చ్చ‌ని అన్నాడు. సందీప్ రెడ్డి(Sandeep Reddy) చేసిన ఈ కామెంట్స్ ఆస‌క్తిక‌రంగా మారాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Sandeep Reddy Vanga Shocking Comments

ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌ను తెలుగులో అర్జున్ రెడ్డి తీశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత హిందీలో అదే సినిమాను షాహిద్ క‌పూర్ తో తీశాడు. అది బిగ్ హిట్. ఆ త‌ర్వాత బాలీవుడ్ టాప్ హీరో ర‌ణ బీర్ క‌పూర్ తో మూవీ తీశాడు. అదే యాన‌మిల్. ఏకంగా రూ. 1000 కోట్ల‌ను క్రాస్ చేసింది. నిర్మాత‌ల‌కు కాసుల పంట పండించేలా చేసింది. ఇందులో రొమాన్స్ , హింస మోతాదుకు మించి పోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది క‌లెక్ష‌న్స్. ఎక్కువ‌గా యూత్ ను ఆక‌ట్టుకుంది.

ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం వంగా సందీప్ రెడ్డి పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ తో సినిమా తీసే ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. దాని పేరు స్పిరిట్. త‌ను ఎంచుకునే పాత్ర‌లు డిఫ‌రెంట్ గా ఉంటాయి. అందుకే త‌ను పూర్తిగా ఇత‌ర ద‌ర్శ‌కుల‌కంటే భిన్నంగా ఉంటాడు.

Also Read : Champions Trophy Semi Final :భార‌త్ సిద్దం ఆసిస్ స‌న్న‌ద్దం

CommentsSandeep Reddy VangaViral
Comments (0)
Add Comment