Sana Raees Khan : అంద‌రి క‌ళ్లు స‌నా ఖాన్ పైనే

బిగ్ బాస్ 17లో కీల‌కం

Sana Raees Khan : ఎవ‌రీ స‌నా ర‌యీస్ ఖాన్ అనుకుంటున్నారా. పేరు పొందిన లాయ‌ర్ . ముంబైతో పాటు ఢిల్లీ కోర్టులలో వాదిస్తారు. ఇప్ప‌టికే ప‌లు కీల‌క‌మైన కేసులు ఆమె చేతిలో ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఆమె అనూహ్యంగా బిగ్ బాస్ 17 రియాల్టీ షోకు ఎంపికైంది. ఇక్క‌డే తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. చివ‌ర‌కు కోర్టు దాకా వెళ్లింది. బార్ అసోసియేస‌న్ కు ఫిర్యాదు కూడా వెళ్లింది. త‌ను ఒక లాయ‌ర్ అయి ఉండి , బాధ్య‌త క‌లిగి ఉండాల్సింది పోయి విచిత్రంగా బిగ్ బాస్ షోలో ఎలా పాల్గొంటుందంటూ పిటిష‌న్ దాఖ‌లైంది.

Sana Raees Khan Viral

దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు స‌నా ర‌యీస్ ఖాన్(Sana Raees Khan) కు అనుకూలంగా వ్యాఖ్యానించింది. వ్య‌క్తిగ‌తంగా త‌న నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేసే హ‌క్కు కోర్టుకు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ స‌మాజానికి వ్య‌తిరేకంగా నో లేదా అభ్యంత‌క‌ర‌మైన స‌న్నివేశాలు, లేదా మాట‌లు , హావ భావాలు వ్య‌క్తం చేస్తే దాని ప‌ట్ల ఎవ‌రికైనా అభ్యంత‌రాలు ఉంటే తాము ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని తెలిపింది.

దీంతో మ‌రోసారి దేశ వ్యాప్తంగా స‌నా రాయిస్ ఖాన్ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 15న బిగ్ బాస్ 17 రియాల్టీ షో గ్రాండ్ గా ప్రారంభ‌మైంది. దీనికి హోస్ట్ ఎవ‌రో కాదు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్. మొత్తంగా షోలో ఖాన్ కంటే స‌నా రాయిస్ ఖాన్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

Also Read : Guntur kaaram: అభిమానులకు మహేష్ దీపావళి కానుక

Comments (0)
Add Comment