Sana Makbul : పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్ ఓటీటీ 3 విజేతగా నిలిచింది సనా మక్బూల్. తను ఊహించని వ్యాధికి గురైంది. గతంలో ప్రముఖ పాన్ ఇండియా హీరోయిన్ సమంత రుతు ప్రభు కూడా అప్పట్లో ఇదే డిసీజ్ కు గురైంది. ఈ వ్యాధి ఏమిటనేది ఇప్పటి వరకు తెలుసుకోలేక పోయారు వైద్యులు. తాజాగా బాంబు పేల్చింది సనా ముక్బూల్(Sana Makbul). 2020లో తనకు ఈ వ్యాధి ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా సమంతా రూత్ ప్రభు దీర్ఘకాలిక కండరాల సంబంధిత రుగ్మత అయిన మయోసిటిస్ లాంటిదని అభివర్ణించారు.
Sana Makbul Suffering with
భారతీ సింగ్, హర్ష్ లింబాచియా పాడ్‌కాస్ట్ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకుంది సనా మక్బూల్. ఇందులో తన ఆరోగ్య పరిస్థితి గురించి, అది తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలియ చేసింది.
నేను ఇటీవల ఆరోగ్య కారణాల వల్ల శాకాహారిగా మారానని చెప్పింది సనా ఇక్బాల్. చాలా మందికి తెలియదు కానీ నాకు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ ఉందన్నారు. తనకు టెస్టుల సందర్బంగా కాలేయ వ్యాధి సోకిందన్నారు. ఈ డిసీజ్ కాలేయ కణాళపై దాడి చేస్తోందని పేర్కొంది నటి. కొంత మందికి ఈ వ్యాధి వల్ల మూత్ర పిండాలను ప్రభావితం చేస్తుండగా ఇంకొందరికి శరీరంలోని ఇతర విభాగాలపై ఎఫెక్ట్ చూపుతుందన్నారు.
Also Read : Hero Nithin-Robinhood :రాబిన్ హుడ్ స్పెషల్ సాంగ్ కేక