Samyuktha : మహిళల కోసమై ‘ఆదిశక్తి’ సేవా సంస్థను ప్రారంభించిన సంయుక్త..

ఇకపై 'ఆదిశక్తి' అనే సేవా సంస్థ ద్వారా వివిధ రంగాల్లో మహిళల కోసం పని చేస్తానని సంయుక్తా మీనన్ ప్రకటించారు.

Samyuktha : చాలా మంది స్టార్ హీరోయిన్లు కొన్ని స్వచ్ఛంద సంస్థలను స్థాపించి ఎంతో మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుసగా టైటిల్స్‌ను గెలుచుకున్న సయుక్త కూడా ఈ జాబితాలో చేరింది. నిస్సహాయ మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఈ స్టార్ హీరోయిన్ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. శ్రీరామ నవమి సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సేవా సంస్థ వివరాలను ఆమె లాంఛనంగా ప్రకటించారు. ఇకపై ‘ఆదిశక్తి’ అనే సేవా సంస్థ ద్వారా వివిధ రంగాల్లో మహిళల కోసం పని చేస్తానని సంయుక్తా మీనన్ ప్రకటించారు.

Samyuktha Starts..

మహిళలకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు వారి అభివృద్ధి పథంలో అన్ని కోణాల్లో వారికి తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ఈ ‘ఆదిశక్తి’ సంస్థను స్థాపించినట్లు సంయుక్త తెలిపారు. ఈ సంస్థ అన్ని వయసుల మహిళలకు సహాయం చేస్తుంది. ఈ ఆదిశక్తి సంస్థ మహిళలకు విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం తదితర అంశాల్లో మద్దతునిస్తుంది. మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలా, అన్ని రంగాల్లో తమ గళాన్ని వినిపించేలా చేయడమే ఆదిశక్తి సంస్థ లక్ష్యమని సంయుక్త తెలిపారు.

Also Read : Uljah Teaser : ‘ఉలజ్’ అనే మరో స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్న జాన్వీ

NewSamyuktha MenonUpdatesViral
Comments (0)
Add Comment