Samyuktha Menon : మలయాళీ బ్యూటీ సంయుక్త పెళ్లి పీటలెక్కబోతుందా..?

వైరల్ అవుతున్న సంయుక్త మీనన్ మ్యారేజ్ రూమర్స్

Samyuktha Menon : వరుస హిట్లతో లక్కీ గర్ల్ అన్న టాగ్ సొంతం చేసుకున్న బ్యూటీ సడెన్గా సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. టాలీవుడ్ లో తొలి సినిమా రిలీజ్ తరవాత ఒక్క సంవత్సరంలోనే మరో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కెరీర్ మంచి ఫార్మ్ లో ఉండగానే పెళ్లి చేసుకోబోతున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా బ్యూటీ..?

Samyuktha Menon Marriage rumors Viral

సంయుక్త మీనన్ గురించి ఇప్పుడు తెలుగువారికి స్పెషల్ గా పరిచయం చేయవలసిన అవసరం లేదు, ఆ మధ్య వరుస సక్సెస్లతో లక్కీ గర్ల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో వరుస హిట్స్ తో సత్తాచాటారు. టాప్ స్టార్స్ మూవీస్ లోను ఛాన్సులు కొట్టేసారు.

కెరీర్ స్టార్టింగ్ లోనే నెగటివ్ రోల్ చేసి షాక్ ఇచ్చిన సంయుక్త ‘డెవిల్’ తరవాత మరో మూవీకి సైన్ చేయలేదు. ఒక్క ఏడాదిలోనే నాలుగు రిలీజులతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. దీనితో పెళ్లిచేసుకోవాలి అనే ఉద్దేశంతోనే సంయుక్త(Samyuktha Menon) సినిమాలకు బ్రేక్ ఇచ్చారా అన్న చర్చ మొదలైంది.

పెళ్లివార్తలపై సంయుక్త స్వయంగా స్పందించకపోయిన ఆమె టీం మాత్రం అవన్నీ రూమర్స్ అంటూ కొట్టి పారేస్తోంది. బిజీ షెడ్యూల్స్ వల్ల అలసిపోయిన ఈ బ్యూటీ కాస్త రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో బ్రేక్ ఇచ్చారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలంటే ఆఫీసియల్ అప్డేట్ వచ్చేంతవరకు వేచి చూడాలి.

Also Read : Hero Santosh Sobhan : ‘జోరుగా హుషారుగా షికారు పోదమ’ అంటూ వస్తున్న హీరో సంతోష్

BreakingCommentsmarriageSamyuktha MenonViral
Comments (0)
Add Comment