Samyuktha Menon: శర్వా 37 నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదల !

శర్వా 37 నుండి సంయుక్త ఫస్ట్ లుక్ విడుదల !

Samyuktha Menon: ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు… చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శర్వా 37 (వర్కింగ్ టైటిల్) తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. హిలేరియస్ రైడ్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌ కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌ తో కలిసి అనిల్ సుంకర, AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే బుధవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ పోస్టర్ ద్వారా ఆమె పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో దియా గా సంయుక్త నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Samyuktha Menon Movie Updates

సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే… ఇందులో సంయుక్త(Samyuktha Menon) సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ… అచ్చమైన, స్వచ్చమైన తెలుగమ్మాయిలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ లో కనిపిస్తోంది. ఈ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంటూ… సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌ని షేర్ చేస్తూ… నెటిజన్లు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. శర్వా 37 చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీ, భాను బోగవరపు కథ, నందు సావిరిగాన డైలాగ్స్, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర సహ నిర్మాత కాగా కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. త్వరలోనే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఇతర విషయాలను మేకర్స్ తెలియజేయనున్నారు.

Also Read : Devara: ‘దేవర’ సెన్సార్‌ రిపోర్టు వచ్చేసింది ! రన్‌టైమ్‌ ఎంతంటే ?

Samyuktha MenonSharwa 37Sharwanand
Comments (0)
Add Comment