Akhanda 2 : దమ్మున్న డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నందమూరి నట సింహం బాలకృష్ణకు బిగ్ హిట్ ఇచ్చాడు. కాసుల వర్షం కురిపించడంతో అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించి ఇటీవలే ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో కూడా షూటింగ్ కు సంబంధించి కొన్ని సీన్స్ తీశాడు.
Akhanda 2 Updates
తాజాగా అఖండ -2(Akhanda 2) మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న మలయాళ భామ సంయుక్త మీనన్ ను కీ రోల్ పోషించేందుకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. తొలిసారిగా బాలయ్య బాబుతో సీన్ షేర్ చేసుకుంటోంది ఈ అమ్మడు.
తను మలయాళంలో బిజీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతోంది. చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ లో తళుక్కుమంది. ప్రతి నాయకుడి పాత్ర పోషించిన దగ్గుబాటి రాణాకు భార్యగా నటించింది.
ఇక బోయపాటి శ్రీను తీస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కథా పరంగా అత్యంత కీలకమైన పాత్రను సంయుక్త మీనన్ పోషించ బోతోందని ప్రకటించారు దర్శకుడు. ఎప్పటి లాగే ఎస్ఎస్ థమన్ దీనికి సంగీతం అందించనున్నాడు. రాబోయే అఖండ మామూలుగా ఉండదంటూ చెప్పేశాడు. బాలయ్య తాజాగా బాబీ దర్శకత్వం వహించిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.
Also Read : Janhvi Kapoor Interesting : శ్రీవారి సన్నిధి లోనే శేష జీవితం