Samuthirakani: బడా నిర్మాతకు సముద్రఖని స్వీట్ వార్నింగ్

బడా నిర్మాతకు సముద్రఖని స్వీట్ వార్నింగ్

Samuthirakani: కె.ఈ. జ్ఞానవేల్‌ రాజా కోలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు. జ్ఞానవేల్‌ రాజా నిర్మాతగా, డిస్ట్రీబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాల్లో సింహా భాగం హీరో సూర్య… అతని తమ్ముడు కార్తీ వే. సుమారు 16 ఏళ్ళ క్రితం హీరో కార్తిని వెండితెరకు పరిచయమైన చిత్రం ‘పరుత్తివీరన్‌’ ఈయన నిర్మించిందే. ఇటీవల కార్తీ 25వ సినిమా ‘జపాన్‌’ నిర్మాత కూడా ఇతనే. దీనితో ‘జపాన్‌’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కార్తితో పనిచేసిన అందరు దర్శకులు హాజరయ్యారు. అయితే కార్తి మొదటి సినిమా ‘పరుత్తివీరన్‌’ దర్శకుడు ఆమిర్ మాత్రం ఈ ఈవెంట్ కు గైర్హాజరయ్యారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఆమిర్… ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ‘జపాన్‌’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య – కార్తితో నాకు సత్సంబంధాలు లేవు. జ్ఞానవేల్‌ రాజా మా మధ్యలోకి రావడంతోనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి’ అని చెప్పారు. దర్శకుడు ఆమిర్ వ్యాఖ్యలపై స్పందించిన జ్ఞానవేల్‌ రాజా .. ‘‘అతడికి ఆహ్వానం పంపించాం. ‘పరుత్తివీరన్‌’ విషయంలో నన్ను ఇబ్బందిపెట్టాడు. అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చూపించకుండా నా డబ్బులు దోచుకున్నాడు’’ అని ఆరోపణలు చేశాడు. దీనితో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే జ్ఞానవేల్‌ రాజా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సముద్రఖని ఏకంగా ఓ బహిరంగ లేఖ రాశాడు.

Samuthirakani – నిర్మాత జ్ఞానవేల్‌ రాజాకు సముద్రఖని బహిరంగ లేఖ

ఆమిర్-జ్ఞానవేల్‌ రాజా వివాదంపై ఘాటుగా స్పందించిన సుమద్రఖని… జ్ఞానవేల్‌ రాజాను ఉద్దేశ్యించి బహిరంగ లేఖ రాసారు. ‘‘పరుత్తివీరన్‌’లో నేనూ నటించాను. ఆ సినిమా తెరకెక్కించడంలో దర్శకుడు ఆమిర్‌ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో నాకు తెలుసు. నిర్మాతవైన నువ్వు మాత్రం ఒక్కరోజు కూడా సెట్‌కు వచ్చింది లేదు. సినిమా బడ్జెట్‌ విషయంలోనూ సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవు.. నేను ఈ సినిమా చేయను.. అని షూటింగ్‌ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు తీసుకువచ్చి ఆమిర్‌ ఆ సినిమా పూర్తి చేశాడు. దానికి నేనే సాక్ష్యం. ఎంతో కష్టపడి ఆయన సినిమా పూర్తి చేస్తే నిర్మాత అనే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈరోజు నువ్వు దర్శకుడిని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేస్తున్నావు. ఇదేం బాలేదు. నీకింత ధైర్యమెక్కడిది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు’’ అని సముద్రఖని(Samuthirakani) లేఖలో అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Mahesh Babu: ఒకే వేదికపైకి రాజమౌళి, మహేష్ బాబు

Samuthirakani
Comments (0)
Add Comment