Samharam : ధర్మ నిర్మించి, దర్శకత్వం వహంచిన సంహారం సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా క్లియర్ కావడంతో మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సంహారం(Samharam) చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. కీలక వ్యాఖ్యలు చేశారు దర్శక, నిర్మాత ధర్మ. పూర్తిగా ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ అని పేర్కొన్నారు.
Samharam Movie Updates
ప్రధానంగా ఎన్నో కుటుంబాలు ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాయని, ఈ తరుణంలో ఓ ధైర్యవంతురాలైన యువతి ఎలా తన ఫ్యామిలీని సంఘ విద్రోహ శక్తుల నుంచి, దాడుల నుంచి రక్షించుకుంటుందనేది ఈ సంహారంలో చూపించడం జరిగిందని చెప్పారు.
ప్రధానంగా ఈ మూవీకి మార్షల్ ఆర్ట్స్ హైలెట్ గా నిలుస్తాయని, ఈ విభాగంలో సినిమాలో కీ రోల్ పోషిస్తున్న నటి కవిత మహ అద్భుతంగా పాత్రలో లీనమై నటించిందని కితాబు ఇచ్చారు. ప్రస్తుతం టెక్నాలజీతో పాటు నేరాల సంఖ్య పెరిగి పోతోందని, వాటి నుంచి రక్షించు కోవాలంటే మనంతకు మనం ప్రధానంగా మహిళలు ఎలా తమను తాము రక్షించు కోవాలనే దాని గురించి ప్రత్యేకంగా ఈ సంహారం ద్వారా చెప్పే ప్రయత్నం చేశామన్నారు దర్శకుడు ధర్మ.
అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునేలా చిత్రాన్ని తీశామని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా సినిమాను జనవరి 31న విడుదల చేస్తున్నామని ప్రకటించాడు.
Also Read : Koti Music Magic : కోటి ఆల్బమ్ కైలాష్ ఖేర్ గానం