Beauty Samantha :ప్ర‌కృతితో స‌హ‌వాసం బ‌తుకంతా ఆనందం

ధ్యానంతో సేద‌దీరుతున్నాన‌న్న స‌మంత

Samantha : ప్యాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు(Samantha) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ఈ మ‌ధ్య ఎక్కువ‌గా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంటోంది. త‌ను ముందు నుంచి ప్ర‌కృతి ప్రేమికురాలు. త‌న‌కు జంతువుల‌న్నా, చెట్లు పెంచ‌డం అన్నా , పుస్త‌కాలు చ‌ద‌వ‌డం, ధ్యానం చేయ‌డం అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. అందుకే వీలు చిక్కితే ద‌ర్శ‌నీయ స్థ‌లాల‌ను, ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తూ వ‌స్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు వెబ్ సీరీస్ లలో న‌టిస్తూ బిజీగా మారి పోయింది ఈ అద్భుత‌మైన న‌టి.

Samantha Ruth Prabhu Comment

ప్ర‌త్యేకించి త‌ను దేనిని త‌ట్టుకోలేదు. ఆ మ‌ధ్య‌న విచిత్రమైన రోగానికి గురైన‌ట్లు త‌నే వెల్ల‌డించింది. ఆ త‌ర్వాత మాన‌సిక సాంత్వ‌న కోసం త‌ను ధ్యానాన్ని, మోక్ష మార్గాన్ని అనుస‌రించింది. త‌ను ప్ర‌త్యేకించి ఇషా ఫౌండేష‌న్ ఫౌండ‌ర్, గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ తో ధ్యానంపై క్లాసులు తీసుకుంది. ఇప్పుడు ఇంట్లో త‌నే స్వ‌యంగా , ఎక్క‌డైనా స్థ‌లం ఉంటే , ప్ర‌శాంత‌త కోసం మెడిటేష‌న్ చేస్తూ వ‌స్తోంది. ఈ మ‌ధ్య‌న ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

తాజాగా మ‌రో అద్భుత‌మైన ఫోటో స‌మంత రుత్ ప్ర‌భుది సెన్సేష‌న్ అయ్యింది . చిట్ చాట్ సంద‌ర్బంగా
ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు సూప‌ర్ ఆన్స‌ర్ ఇచ్చింది. మీ ఫోటో బాగుందని, ఇది ఎక్క‌డ ఎవ‌రు తీశారో చెప్పాల‌ని కోర‌డంతో సిడ్నీ వైల్ లైఫ్ పార్కులో ఉన్నాన‌ని, త‌న ఫోటోల‌ను ఎవ‌రు క్లిక్ చేశారో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్పింది. ఇదే స‌మ‌యంలో ఇన్ స్టాలో స‌మాధానం ఇస్తూ..ఓ అద్భుత‌మైన క్యాప్ష‌న్ కూడా జోడించింది. అదేమిటంటే ప్రకృతి, జంతువులు..మంచి వైబ్స్ అని స్ప‌ష్టం చేసింది.

Also Read : Hero Mohan Lal :మోహ‌న్ లాల్ ఎంపురాన్ క‌లెక్ష‌న్స్ అదుర్స్

CommentsSamantha Ruth PrabhuViral
Comments (0)
Add Comment