Samantha : ప్యాన్ ఇండియా హీరోయిన్ సమంత రుత్ ప్రభు(Samantha) కీలక వ్యాఖ్యలు చేసింది. తన లైఫ్ లో జరిగిన సంఘటనల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిట్ చాట్ సందర్బంగా స్పందించింది. తన జర్నీ ఇప్పటి దాకా సాఫీగా సాగలేదని పేర్కొంది. జీవితంలో కొందరు అనుకోకుండా కలుస్తారు. మరికొందరు తెలియకుండానే నిష్క్రమిస్తారని స్పష్టం చేసింది. అక్కినేని నాగ చైతన్య తో పెళ్లి చేసుకోక ముందు కూడా తను హీరో సిద్దార్థ్ తో డేటింగ్ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. ఈ సందర్బంగా తను ఎందుకు విడి పోయాననే విషయంపై బయట కు చెప్పేసింది.
Samantha Ruth Prabhu Comment
2013లో ప్రారంభమైన ఈ వ్యవహారం కొంత కాలంపాటు సాగిందన్నారు. ఇద్దరం 2015లో విడి పోయామని చెప్పింది. ఆ సమయంలో నాగ చైతన్య గనుక తన జీవితంలోకి రాక పోయి ఉండి ఉంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేదానినని పేర్కొంది సమంత రుత్ ప్రభు. సరైన సమయంలోనే తాను నిష్క్రమించడం మంచి పనైందని తెలిపింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఇదే ప్రధాన చర్చకు దారి తీసింది.
2013లో జబర్దస్త్ చిత్రం సెట్స్ లో కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. డేటింగ్ కొనసాగింది. ఇద్దరూ కలిసి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి మనోడు దీపా సన్నిధితో డేటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విడి పోయింది. రంగ్ దే బసంతి హీరోతో కూడా కొంత సాన్నిహిత్యంగా మెలిగిందని ప్రచారం జరిగింది అప్పట్లో.
ఆ తర్వాత 2014లో ఆటోనగర్ సూర్య చిత్రంలో నాగ చైతన్యతో కలిసి పని చేసింది. అప్పటి నుంచి స్నేహం కుదరడం, ఏమాయ చేశావే మూవీతో బల పడటం కూడా జరిగి పోయింది. ఆ తర్వాత విడి పోయారు. నా జీవితం కూడా సావిత్రి లాగే తయారైందని పేర్కొంది సమంత .
Also Read : Hero Allu Arjun-Priyanka :ఐకాన్ స్టార్ తో బాలీవుడ్ బ్యూటీ