Samantha Love Story :స‌మంత‌..రాజ్ నిడిమోరు ప్రేమ‌లో ప‌డ్డారా..?

పుకార్ల‌కు తెర లేపిన క‌నిపించిన జంట

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు , వెబ్ సీరీస్ ద‌ర్శ‌కుడు రాజ్ నిడిమోరు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారారు. పెళ్లి పుకార్ల‌కు తెర లేపారు. ఇద్ద‌రూ ఎక్క‌డికి వెళ్లినా బుక్ అవుతున్నారు. స‌మంత(Samantha) నాగ చైత‌న్య‌తో విడి పోయాక ఒంట‌రిగా ఉంటున్నారు. చైత‌న్య ధూళిపాళ‌తో పెళ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల‌లో బిజీగా మారింది. ద‌ర్శ‌కుడు రాజ్ నిడి మోరుతో కొన్ని వెబ్ సీరీస్ ల‌లో ఎక్కువ‌గా క‌నిపించింది. ఈ ఇద్ద‌రూ డేటింగ్ లో ఉన్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Samantha Love Story Viral

ఇటీవల స్నేహితులతో విహార యాత్రలో ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత నటి మరోసారి చిత్ర నిర్మాత రాజ్ నిడిమోరుతో క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇద్ద‌రి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. సమంత స్టైలిష్ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ప్రకాశవంతంగా కనిపించింది. రాజ్ టీ-షర్ట్ , జీన్స్‌లో క్యాజువల్ ధ‌రించారు. ఇద్ద‌రూ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచాడు.

ఈ జంట డేటింగ్ పుకార్లకు గురి కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు క‌లిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సంచ‌ల‌నంగా మారాయి. మ‌రింత ఊహాగానాల‌కు బ‌లం చేకూర్చేలా చేసింది. తాజా బ‌హిరంగ ప్ర‌ద‌ర్శ‌న అగ్నికి ఆజ్యం పోసేలా చేసింది.

Also Read : Sana Makbul Shocking Disease :సనా మ‌క్బూల్ కు ఆటో ఇమ్యూన్ డిసీజ్

Love StorySamanthaUpdatesViral
Comments (0)
Add Comment