Beauty Samantha :అతిథి పాత్ర‌లో స‌మంత రుత్ ప్ర‌భు

ప‌ర‌దా మూవీలో పాత్ర‌కు క‌న్ ఫ‌ర్మ్

Samantha : స‌మంత రుత్ ప్ర‌భు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వ‌స్తోంది. ప్ర‌ముఖ త‌మిళ సినీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ను ఏమాయ చేశావే సినిమాతో తెరంగేట్రం చేసింది. త‌న‌తో పాటు అక్కినేని నాగ చైత‌న్య కూడా న‌టించారు. ఆ త‌ర్వాత ఈ ఇద్ద‌రు క‌లిసి ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ త‌ర్వాత స్టార్ హీరోలతో స‌మంత న‌టించింది. ఇటు త‌మిళంలో, తెలుగులో విజ‌య‌వంత‌మైన సినిమాల‌లో న‌టించింది..మెప్పించింది.

Samantha Movie Updates

ల‌క్ష‌లాది మంది గుండెల‌ను మీటింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ త‌ర్వాత నాగ చైత‌న్య‌తో పెళ్లి చేసుకుంది. కొంత కాలం ఆనందంగా గ‌డిపారు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కాని విడి పోయారు. ఇటు చైత‌న్య మ‌రో న‌టి శోభిత ధూళిపాళ‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎక్క‌డా నిరాశ‌కు లోను కాలేదు స‌మంత‌(Samantha). త‌ను ప్ర‌స్తుతం వెబ్ సీరీస్ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు రాజ్ నిడుమూరుతో డేటింగ్ చేస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు స‌మంత రుత్ ప్ర‌భు.

ఇటు సినిమాల‌లో అటు వెబ్ సీరీస్ లో కీల‌కంగా మారింది ఆ మ‌ధ్య‌న పుష్ప‌-1 చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ లో ద‌ర్శ‌నం ఇచ్చింది. కుర్ర‌కారు గుండెల‌ను గిలిగింత‌లు పెట్టింది. ఊ అంటావా ఊఊ అంటావా అని దుమ్ము రేపింది. తాజాగా స‌మంత రుత్ ప్ర‌భు నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ న‌టిస్తున్న ప‌ర‌దా చిత్రంలో త‌ను కీల‌క గెస్ట్ రోల్ ను పోషించేందుకు ఓకే చెప్పింది. ఈ విష‌యంపై జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ప‌ర‌దా మూవీపై భారీ అంచ‌నాలు పెంచేలా చేసింది.

Also Read : Hero Ravi Teja-Mass Jathara : మ‌హ‌రాజా ర‌వితేజ మాస్ జాత‌ర

New MoviesSamantha Ruth PrabhuUpdatesViral
Comments (0)
Add Comment