Samantha Ruth Prabhu : ఖుషితో స‌మంత ఖుషీ

శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం

Samantha Ruth Prabhu : పుష్ప ది రైజ్ సినిమాలో ఊ అంటావా మావా అన్న సాంగ్ తో ఒక్క‌సారిగా స‌మంత రుత్ ప్ర‌భు(Samantha Ruth Prabhu) పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారి పోయారు. ఆమె నాగ చైత‌న్య‌తో విడి పోయాక కొంత మాన‌సికంగా ఇబ్బందికి లోన‌య్యారు. కానీ ఆ త‌ర్వాత తేరుకున్నారు. తీవ్ర‌మైన అనారోగ్యం కూడా స‌మంత‌ను ఒక చోట కుదురుగా ఉండ‌నీయ‌లేదు.

Samantha Ruth Prabhu Words

దానికి మాన‌సికంగా ఆమె ప్రిపేర్ అయ్యారు. ఈ త‌రుణంలో ఆమె మైత్రీ మూవీ మేక‌ర్స్ తో ఒప్పందం చేసుకుంది. అదే శివ నిర్వాణ తీసిన ఖుషీ మూవీ. ఇందులో రౌడీ బాయ్ గా పేరు పొందిన విజ‌య్ దేవ‌ర‌కొండ హీరో. ఇద్ద‌రి కెమిస్ట్రీ పండింది. ప్ర‌త్యేకించి ప్రేమ‌ను బేస్ గా చేసుకుని తెర మీదకు ఎక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు.

ఖుషీ చిత్రానికి ప్ర‌ధానంగా స‌న్నివేశాలు, దృశ్యాలు, పాట‌లు . శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించి స్క్రీన్ ప్లే వ‌హించాడు. ఈ చిత్రాన్ని ఎక్కువ‌గా జ‌మ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చిత్రీక‌రించారు. ప్ర‌త్యేకించి అంద‌మైన లొకేష‌న్స్ ఆక‌ట్టుకునేలా ఉన్నాయి.

ముఖ్యంగా యూత్ ను క‌ట్టి ప‌డేసేలా. ఖుషీకి మిక్స్ డ్ టాక్ వ‌చ్చినా ఆ త‌ర్వాత హిట్ టాక్ అందుకుంది. ఈ సంద‌ర్భంగా న‌టి స‌మంత స్పందించింది. ఆనందంగా ఉంద‌ని పేర్కొంది.

Also Read : Rana Daggubati : అమ‌ర్ చిత్ర క‌థ‌పై రానా ఆస‌క్తి

Comments (0)
Add Comment