సినీ రంగానికి సంబంధించి సమంత రుత్ ప్రభు గురించి ఎంత చెప్పినా తక్కువే. గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేసావే సినిమాతో దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇందులో సమంతతో పాటు అక్కినేని నాగ చైతన్యతో నటించింది. ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రం. భారీ ఆదరణ చూరగొంది. ఈ సినిమా నుంచే ప్రేమలో పడ్డారు వీరిద్దరూ.
ఆ తర్వాత అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఒక్కటయ్యారు. షికార్లు చేశారు. విదేశాలు పర్యటించారు. అంతలో ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి మేం విడిపోతున్నామంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందరినీ విస్తు పోయేలా చేశారు.
ఇది నిజమేనంటూ నాగార్జున, నాగ చైతన్య కూడా ధ్రువీకరించారు. ఆ తర్వాత చైతన్య సాయి పల్లవితో సినిమా తీశారు. అది హిట్ అయ్యింది. ఇక సమంత రుత్ ప్రభు ఇటు సినిమాల్లో , వెబ్ సీరీస్ లలో నటించింది బిజీగా మారి పోయింది.
విచిత్రం ఏమిటంటే దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్ మూవీలో ఒకే ఒక్క పాటలో నటించింది సమంత. ఊ అంటావా మావా ఊ అంటావా అన్న సాంగ్. ఇది సెన్సేషన్ హిట్ గా నిలిచింది. సమంత ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారింది. తాజాగా హాట్ టాపిక్ గా మారింది. నాగ చైతన్యకు సంబంధించి తన నడుముపై వేయించుకున్న టట్టూను పూర్తిగా తొలగించింది.