Beauty Samantha Award : ఓటీటీలో ఉత్త‌మ న‌టిగా స‌మంత రుత్ ప్ర‌భు

హ‌నీ బ‌న్నీ సీరీస్ లో కీల‌క పాత్ర పోషించినందుకు

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భుకు(Samantha) అరుదైన గౌర‌వం ల‌భించింది. ఇటు సినిమాల‌లో అటు వెబ్ సీరీస్ ల‌లో బిజీగా ఉంది. కీల‌క‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా తాను న‌టించిన ఓటీటీలో ప్ర‌సార‌మైన హ‌నీ బ‌న్నీ సీరీస్ కు గాను అవార్డుకు ఎంపికైంది. అద్బుత‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించినందుకు త‌న‌ను ఓటీటీ ఫార్మాట్ లో ఉత్త‌మ న‌టిగా ఎంపిక చేసిన‌ట్లు మీడియా సంస్థ నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు.

Samantha got Best Actress Award from OTT

త‌ను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌-1 చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ ఊ అంటావా అనే పాట‌లో న‌టించింది. ఈ ఒక్క పాటతో త‌న‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. ఇంకో వైపు తీవ్ర అనారోగ్యానికి గురైనా, విడాకులు తీసుకున్నా వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టి ప్ర‌స్తుతం కేవ‌లం సినీ కెరీర్ పైనే దృష్టి సారించింది స‌మంత రుత్ ప్ర‌భు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ఉత్త‌మ న‌టిగా ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపింది న‌టి. ఇది త‌న జీవితంలో మ‌రిచి పోలేనంటూ పేర్కొంది.

ఈ పుర‌స్కారంతో త‌న‌పై బాధ్య‌త మ‌రింత పెంచేలా చేసింద‌ని చెప్పింది. మ‌నీ బ‌న్నీ సీరీస్ కు సంబంధించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది సమంత రుత్ ప్ర‌భు. ఈ సీరీస్ ను కంప్లీట్ చేస్తానా లేదా అన్న ఆందోళ‌న ఉండేద‌న్నారు. ఈ సీరీస్ షూటింగ్ స‌మ‌యంలో తాను ఎన్నో మాన‌సిక‌, శారీర‌క ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డ్డాన‌ని, చివ‌ర‌కు దర్శ‌కుడు రాజ్ మిడ‌నూర్ కార‌ణంగా బ‌య‌ట ప‌డ్డాన‌ని చెప్పింది.

Also Read : Popular IPL 2025 : ఐపీఎల్ మెగా టోర్నీ సంబురం షురూ

AwardsOTTSamantha Ruth PrabhuTrendingUpdates
Comments (0)
Add Comment