Samantha: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత !

అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సమంత !

Samantha: రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వరుణ్‌ ధావన్‌, సమంత జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ పై అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ తరువాత సమంత నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దీనితో ‘సిటాడెల్‌’ కోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘సిటాడెల్‌’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయని సమంత తెలిపింది. రాజ్‌ అండ్‌ డీకే, వరుణ్‌ధావన్‌ తో కలిసి ‘సిటాడెల్‌’ రషెస్‌ చూసాను… వెబ్ సిరీస్ బాగా వచ్చింది.

అంతేకాదు నా పాత్రకు డబ్బింగ్ కూడా మొదలు పెట్టానంటూ… స్టూడియోలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది. ప్రస్తుతం సమంత(Samantha) షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్పై యాక్షన్ వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ తరువాత… యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ గా వస్తున్న ‘సిటాడెల్‌’ కోసం అభిమానులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Samantha Comment

‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌ ధావన్ తో కలిసి సమంత చేసే యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని టాక్‌. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుండా ఆమే స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. ఈ క్రమంలోనే స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

Also Read : Jai Hanuman: ప్రశాంత్‌ వర్మ ‘జై హనుమాన్‌’ లో చిరు, మహేశ్ ?

CitadelSamantha Ruth Prabhu
Comments (0)
Add Comment