Samantha: దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర నటి సమంత… మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకునే ఈ ముద్దుగుమ్మ… కుర్రకారును పిచ్చెక్కించేలా బికినీతో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి మలేషియాలో ఓ గ్రాండ్ రిసార్ట్ కు వెళ్ళిన సమంత… అక్కడ ఓ చిన్న పాండ్ లో బికినీలో స్విమ్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే సమంత ఈ ఫోటోలు పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నెట్టింట వైరల్ అయ్యాయి. కొన్ని గంటల్లోనే పది మిలియన్లు వ్యూస్ సంపాదించిన ఆ ఫోటోలు 25 లక్షలకు పైగా లైక్స్ సాధించాయి. అయితే ఈ ఫోటోలను సమంత అభిమానుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది సమంత అందాలను చూసి ఆస్వాదిస్తుంటే… ఆమెను హోమ్లీ లుక్ లో చూడటం అలవాటు పడిన మరికొంతమంది చైతూతో విడాకుల తరువాత గ్లాబర్ డోస్ పెంచిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Samantha Photos Viral
నాగచైతన్యతో విడాకుల తరువాత మయోసైటిస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న సమంత(Samantha) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటించారు. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు విదేశాల్లో హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తుంది సమంత. ప్రస్తుతం సమంత.. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ గా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కు రానుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ తరువాత సమంత నటించిన వెబ్ సిరీస్ కావడంతో దీనిపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Love Guru Movie : విజయ్ ఆంటోనీ సినిమా నుంచి వైరల్ అవుతున్న ఎమోషనల్ సాంగ్