Samantha: మ‌రోసారి విజయ్‌ సరసన సమంత ?

మ‌రోసారి విజయ్‌ సరసన సమంత ?

Samantha: చేతిలో సినిమాలు అంత‌గా లేకున్న ఈ మ‌ధ్య బాగా వార్త‌ల్లో నిలుస్తోంది స‌మంత. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి బ‌య‌ట ప‌డుతున్న ఆమె మ‌ళ్లీ సినిమాల్లో పుంజుకోవాల‌ని చూస్తోంది. ఈ క్ర‌మంలో విదేశాల‌లో ఫొటోషూట్లు చేస్తూ నాలో ఇంకా వ‌న్నె త‌గ్గ‌లేద‌న్న‌ట్లుగా గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తోంది. చివ‌ర‌గా తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమాలో న‌టించిన‌ స‌మంత(Samantha) ఈ త‌ర్వాత‌ చేసిన బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ విడుద‌ల కావాల్సి ఉంది. ప్రస్తుతం ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’, ‘మా ఇంటి బంగారం’ లాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది సమంత. ఈ క్ర‌మంలోస‌మంత‌ తాజాగా ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన‌ట్లు తెలుస్తోంది.

Samantha Movie Updates

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ 69వ చిత్రంలో హీరోయిన్‌గా సమంత(Samantha)ను ఎంపిక చేసినట్టు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం విజయ్‌ 68వ చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్‌, అజ్మల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబరు 5న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. రాజకీయ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా ఎవరు నటిస్తారనే సస్పెన్స్‌ నిన్నటివరకూ ఉండేది. దానికి తెర దించుతూ సమంత ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ గతంలో కలిసి నటించిన మూడు సినిమాలూ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ చిత్రంలోనూ జోడీగా నటించడం అభిమానులను అలరిస్తుందంటున్నాయి సన్నిహితవర్గాలు. దీనికి అనిరుధ్‌ సంగీతం అందించనున్నారని సమాచారం.

అయితే విజ‌య్ ఇప్ప‌టికే రాజ‌కీయ పార్టీ పెట్టి అందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంటున్నారు. అంతేకాకుండా రానున్న త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో ఆయ‌న సినిమాల‌కు తాత్కాలికంగా విరామం ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఎల‌క్ష‌న్‌కు వెళ్లే ముందే త‌న 69వ చిత్రంలో నటించేందుకు కమిట్‌ అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాకే క‌థానాయుయిక‌గా స‌మంతను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఈ ప్రాజెక్టు నవంబరులో సెట్స్ పైకి వెళ్ళనుంది.ఇదిలాఉండ‌గా విజ‌య్ స‌మంత కాంబినేష‌న్‌లో గ‌తంలో మూడు నాలుగు చిత్రాలు కూడా వ‌చ్చాయి.

Also Read : Saripodhaa Sanivaaram: సూపర్ కూల్ గా “సరిపోదా శనివారం” నుంచి నాని సెకండ్ లుక్ !

SamanthaThalapathy Vijay
Comments (0)
Add Comment