Samantha: సినిమాలు లేకపోయినా రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత !

సినిమాలు లేకపోయినా రెమ్యునరేషన్ డబుల్ చేసిన సమంత !

Samantha: దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సమంత. పదేళ్ళకు పైగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన సమయంతో దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్ళాడిన సమంత… వివిధ కారణాలతో చైతూతో విడాకులు తీసుకుంది. ఇటీవల కాలంలో ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌ లోనూ విలన్ తరహా పాత్రతో నటించి అందరికీ షాకిచ్చింది. ఆ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డీకే తీసిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‍ ‌లోనూ సమంత లీడ్ రోల్ చేసింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో ఊ అంటావా మామ… ఊఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ లో నర్తించి తనలో కొత్త కోణాన్ని అభిమానులకు చూపించింది.

Samantha Remuneration

అయితే చైతూతో విడాకుల తరువాత సమంత(Samantha) లైఫ్ లో కాస్తా ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన డ్రీం ప్రాజెక్టులుగా చెప్పుకునే శాకుంతలం, ఖుషీ వంటి సినిమాలు భారీ డిజాస్టర్ ను మూటకట్టుకోగా… ఆమె కూడా మయోసైటిస్ అనే వ్యాధిన బారిన పడింది. ప్రస్తుతం విదేశాల్లో చికిత్స పొందుతుంది. మయోసైటిస్ నుండి కోలుకుంటున్న సమంత… ప్రస్తుతం వెబ్ సిరీస్, యాడ్స్ లో నటిస్తుంది. అయితే సమంత రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు మరోసారి టాపిక్ వచ్చింది. ఏకంగా డబుల్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.

రాజ్-డీకే దర్శకత్వంలో తెరకెక్కించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్‍ ‌లో లీడ్ రోల్ చేసిన సమంత… దీనికోసం ఏకంగా రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందట. ఈ నేపథ్యంలో సమంత చేతిలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోయినప్పటికీ… కొత్తగా వచ్చే ప్రాజెక్టులకుగానూ ఒక్కో దానికి రూ. 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అలానే ఒక్కో యాడ్‌కి రూ. 1.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోందట. అయితే దీనిలో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజమైతే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే సౌత్ హీరోయిన్లలో ఒకరిగా సమంత నిలుస్తుంది.

Also Read : Jayamalini: సిల్క్‌ స్మిత బలవన్మరణంపై జయమాలిని సంచలన వ్యాఖ్యలు !

CitadelSamantha Ruth Prabhuthe family man
Comments (0)
Add Comment