Beauty Samantha :ఆ చిత్రాన్ని..డైరెక్ట‌ర్ ను మ‌రిచి పోలేను

గౌత‌మ్ వాసుదేవ మీన‌న్ కు రుణ‌ప‌డి ఉంటా

Samantha : పాన్ ఇండియా హీరోయిన్ స‌మంత రుత్ ప్ర‌భు(Samantha) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అద్భుత‌మైన న‌టిగా గుర్తింపు పొందారు. త‌ను కీల‌క పాత్ర‌ల‌లో న‌టించింది. మెప్పించింది. పుష్ప -1 చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ లో న‌టించి కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపింది. సున్నిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన త‌ను ఈ మ‌ధ్య‌న త‌న సినీ కెరీర్ కు సంబంధించి త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

Samantha Comment

త‌ను జీవితాంతం రుణ‌ప‌డి ఉండాల్సింది మాత్రం త‌మిళ సినీ సూప‌ర్ డైరెక్ట‌ర్ వాసుదేవ మీన‌న్ అని అన్నారు. ఎందుకంటే ఎక్క‌డో ఉన్న త‌న‌ను జెస్సీగా జ‌నానికి ప‌రిచ‌యం చేశాడ‌ని, ఆయ‌న అలా చేసి ఉండ‌క పోతే తాను మీ ముందు ఇలా మాట్లాడి ఉండే దానిని కాద‌న్నారు స‌మంత రుత్ ప్ర‌భు.

త‌ను తీసిన ఏమాయ చేశావే మూవీలో త‌న‌కు కీల‌క‌మైన రోల్ ఇచ్చార‌ని, ఆయ‌న నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని తెలిపింది. ఆయ‌న సినిమా రంగం గురించి చెప్పాలంటే ఓ డిక్ష‌న‌రీ అని కొనియాడారు న‌టి.

ఆ ఒక్క సినిమా త‌న‌కు స్టార్ డ‌మ్ తీసుకు వ‌చ్చేలా చేసింద‌ని చెప్పింది. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ అద్భుత‌మ‌ని, తాము కేవ‌లం న‌టించామ‌ని తెలిపింది. ఆ సినిమా తెలుగు లోనే కాదు త‌మిళ సినీ రంగంలో ఎన్న‌ద‌గిన క్లాసిక‌ల్ మూవీగా నిలిచి పోవ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ఆ సినిమా త‌ర్వాత ఎన్నో అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని, అందుకు ఆ మూవీ వెరీ వెరీ స్పెష‌ల్ అని పేర్కొంది స‌మంత రుతు ప్ర‌భు.

Also Read : Sankranthiki Vasthunnam Sensational :ఓటీటీలో సంక్రాంతికి వ‌స్తున్నాం సంచ‌ల‌నం

Commentsgowtham menonSamantha Ruth PrabhuViral
Comments (0)
Add Comment