Samantha: సౌత్ సీనియర్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం !

సౌత్ సీనియర్ హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం !

Samantha: దక్షిణాది సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు సమంత. పదేళ్ళకు పైగా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగిన సమంత… దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. ఆ తరువాత అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్ళాడిన సమంత… వివిధ కారణాలతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత ‘ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్‌ లోనూ, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన పుష్ప సినిమాలో ఊ అంటావా మామ… ఊఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ లో నర్తించి తనలో కొత్త కోణాన్ని అభిమానులకు చూపించింది. తరువాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన సమంత… దాని నుండి కోలుకుని ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.

Samantha…

ప్రస్తుతం సమంత సిటాడెల్: హనీ బన్నీ వెబ్‌ సిరీస్‌ లో నటిస్తున్నారు. రాజ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో వరుణ ధావన్‌ సరసన సమంత(Samantha) నటిస్తున్నారు. దీనితో పాటు పలు సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) ఉత్సవం అవార్డ్స్‌ కార్యక్రమం ఈ నెల 27న దుబాయ్‌ లో జరగనుంది. కార్యక్రమంలో ఆమెను ‘ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుతో సన్మానించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

‘‘ఈ తరానికి చెందిన ఉత్తమ నటుల్లో సమంత ఒకరు. తన వైవిధ్యమైన పాత్రలతో అభిమానులను నిరంతరం ఆకట్టుకునే ఆమెకు ఈ అవార్డును అందజేయటం ఆనందంగా ఉంది’’ అని ఐఫా నిర్వాహకులు తెలిపారు. ఐఫా నిర్ణణంపై స్పందిస్తూ… ‘‘ఐఫా ఉత్సవం నాకెల్లప్పుడూ ప్రత్యేకమే. దక్షిణాది సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు తెలియజెప్పే ఈ వేదికపై పాల్గొనడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను’’ అని సమంత పేర్కొన్నారు.

Also Read : Devara Promotions : దేవర ప్రమోషన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్

CitadelIIFA AwardsSamantha
Comments (0)
Add Comment