Samantha: క్రయోథెరపీ చేయించుకుంటున్న సమంత

క్రయోథెరపీ చేయించుకుంటున్న సమంత

క్రయో థెరపీ చేయించుకుంటున్న సమంత

Samantha : ‘ది మార్వెల్స్‌’ సినిమా ప్రమోషన్ లో బిజీ బిజీగా గడుపుతున్న టాలీవుడ్ అగ్ర కథానాయక సమంత తన ఆరోగ్యానికి సంబందించి కీలక అప్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స తీసుకుంటున్న సమంత… ప్రస్తుతం క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఈ క్రయోథెరపీలో భాగంగా 150 డిగ్రీల చలిలో ఉండే టబ్ లో కూర్చున్నారు. అంతేకాదు క్రయోథెరపీ అంటే ఏంటి ? దాని వల్ల ఉపయోగమేంటో ఆమె స్వయంగా తెలిపారు. క్రయోథెరపీ వల్ల వ్యాధి కారక క్రిములతో పోరాడే తెల్ల రక్తకణాలు పెరుగుతాయని.. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అలాగే మానసిక ప్రశాంతతతో పాటు ఈ థెరపీ శరీరానికి ఎంతో శక్తినిస్తుందని ఆమె వీడియోలో తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియోను సమంత అభిమానులు షేర్‌ చేస్తున్నారు.

మయోసైటిస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న సమంత(Samantha) గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటించారు. ఇటీవల సమంత ఇండోనేషియాలోని బాలీకి వెకేషన్‌కు వెళ్ళి తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. తాజాగా ‘ది మార్వెల్స్‌’ సినిమా ప్రమోషన్స్‌లో స్టైలిష్‌ లుక్‌లో కనిపించి సందడి చేశారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘సిటడెల్’ ఇండియన్‌ వెర్షన్‌ వెబ్‌సిరీస్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు సమంత శరీరంపై టాటూ విషయంపై కూడా సోషల్‌ మీడియాలో మరోసారి చర్చ జరుగుతోంది. ‘ది మార్వెల్స్‌’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె ఇటీవల ఓ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఆ ఫోటోలలో ఆమె నడుముపై ‘చై’ అనే టాటూ కనిపిస్తోంది.

Samantha – క్రయోథెరపీ అంటే ఏమిటి

క్రయోథెరపీ అనేది అసాధారణ కణజాలాన్ని గడ్డకట్టడానికి మరియు తొలగించడానికి తీవ్రమైన చలిని ఉపయోగించడం. వైద్యులు అనేక చర్మ పరిస్థితులకు (మొటిమలు మరియు చర్మపు ట్యాగ్‌లతో సహా) మరియు ప్రోస్టేట్, గర్భాశయ మరియు కాలేయ క్యాన్సర్‌తో సహా కొన్ని క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చికిత్సను క్రయోఅబ్లేషన్ అని కూడా అంటారు.

Also Read : Amala Paul Marrige : నిన్న ముద్దు నేడు పెళ్లి

 

Samantha Ruth Prabhuthe marvel
Comments (0)
Add Comment