Salman : పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలిసారిగా బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్(Salman) తన మూవీలో నటిస్తుండడం విశేషం. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
Salman Rashmika Movie …
సికిందర్ మూవీ షూటింగ్ దాదాపు అయి పోవచ్చిందని, ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ , సాంగ్స్ కు భారీ ఆదరణ లభించిందన్నారు మురుగదాస్. పుష్ప-2 మూవీతో మరోసారి తన సత్తా ఏమిటో చూపించింది మిల్క్ బ్యూటీ రష్మిక మందన్నా.
సికిందర్ మూవీని యాక్షన్ , థ్రిలర్, రొమాంటిక్ ఉండేలా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు మురుగదాస్. తను ఏది తీసినా అది సెన్సేషన్ . గతంలో తళపతి విజయ్ తో తీసిన సర్కార్ దుమ్ము రేపింది. తమిళ , తెలుగు ఇండస్ట్రీలను షేక్ చేసింది. వసూళ్ల వేటలో టాప్ లో కొనసాగింది. ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబుతో తీశాడు.
తన కెరీర్ లో తొలిసారిగా హిందీలో మూవీ చేయడం. అది టాప్ హీరోతో. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. అన్ని హంగులతో వస్తున్న ఈ చిత్రం వచ్చే మార్చి 28న విడుదల చేస్తామని ప్రకటించారు దర్శక, నిర్మాతలు. ఇదిలా ఉండగా ఇదే నెలలో మార్చి 27న చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ కూడా రాబోతోంది. దీనికి చిన్నా ఫేం అరుణ్ కుమార్ దర్శకుడు.
Also Read : Hero Vikram Movie : చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ రెడీ