Salman Khan : సల్మాన్ ఖాన్, సాజిద్ నదియావాలా కాంబినేషన్ లోపలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి స్నేహం దశాబ్ద కాలం నాటిది. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ‘ కిక్’ సినిమాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.ఇప్పుడు సల్లూ, సాజిద్‌లు ‘సికిందర్’ సినిమా కోసం జతకట్టారు. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్(Salman Khan) యాంగ్రీ యంగ్ మ్యాన్ గా కనిపించనున్నాడని సమాచారం. అలాగే రోల్ కూడా ఫుల్ పవర్ చూపించనున్నాడు. ఇంతకుముందు సినిమాల్లో కూడా సల్లూని సరదాగా చూపించారు. కానీ, ఈ సినిమా అలా కాదు. సందేశంతో పాటు భారీగా పోరాట సన్నివేశాలు ఉంటాయి. ఏఆర్ మురుదాస్ సినిమాలో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. అంతేకాకుండా తగు పాళ్లలో వినోదం ఉంటుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్ లో సల్మాన్ ఖాన్ ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమాలో సల్లూ ప్రజల కోసం, వారి హక్కుల కోసం పోరాడబోతున్నాడని సమాచారం.
Salman Khan Movies Update
2025 ఈద్ సందర్భంగా ‘సిఖందర్’ సినిమా విడుదల కానుంది. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు. దీంతో ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేయనుంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇటీవల సల్మాన్ ఖాన్ కుర్చీలోంచి లేవడానికి కష్టపడుతున్న వీడియో వైరల్‌గా మారింది. మరి ఇప్పుడు యాక్షన్ సినిమా ఎలా తీయగలడనే ప్రశ్న తలెత్తింది. ఈ సినిమాతో పాటు హిందీ బిగ్ బాస్ కొత్త సీజన్‌కు కూడా సల్లూ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.
Also Read : Aamir Khan : ఇకపై అమిర్ ఖాన్ సినిమాలు ఓటీటీలో రావా..?